తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిపై బిగ్ బాస్ అభిజీత్ కామెంట్స్.. ఇద్దరం ఒకేసారి అంటూ!

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిపై బిగ్ బాస్ అభిజీత్ కామెంట్స్.. ఇద్దరం ఒకేసారి అంటూ!

Sanjiv Kumar HT Telugu

01 February 2024, 13:28 IST

  • Abhijeet About Lavanya Tripathi: మెగా కోడలు, బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో లావణ్య త్రిపాఠిపై బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కామెంట్స్ చేశాడు.

లావణ్య త్రిపాఠిపై బిగ్ బాస్ అభిజీత్ కామెంట్స్.. ఇద్దరం ఒకేసారి అంటూ!
లావణ్య త్రిపాఠిపై బిగ్ బాస్ అభిజీత్ కామెంట్స్.. ఇద్దరం ఒకేసారి అంటూ!

లావణ్య త్రిపాఠిపై బిగ్ బాస్ అభిజీత్ కామెంట్స్.. ఇద్దరం ఒకేసారి అంటూ!

Abhijeet Lavanya Tripathi Miss Perfect: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్‌గా అలరించిన లావణ్య త్రిపాఠి కొద్ది రోజుల ముందు వివాహం చేసుకుని మెగా ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత ఓటీటీ కంటెంట్‌ చేస్తూ అలరించేందుకు ప్రయత్నిస్తోంది. పెళ్లికి ముందు పులి మేక వెబ్ సిరీసుతో ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి వివాహనంతరం మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీసుతో మరోసారి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ అండ్ కామెడీ జోనర్‌లో వస్తోన్న మిస్ పర్ఫెక్ట్ ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సిరీసుకు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేయగా.. బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ విన్నర్ అభిజీత్ దుద్దాల హీరోగా చేస్తున్నాడు. అలాగే యూట్యూబ్ వెబ్ సిరీసులతో బాగా పాపులర్ అయిన అభిజ్ఞ ఉతలూరు మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీసులో యాక్టర్ హర్షవర్దన్, ఝాన్సీ, హర్ష్ రోషన్, మహేశ్ విట్టా, సతీష్ సారిపల్లి తదితరులు పలు పాత్రల్లో నటించారు.

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దాంతో మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే వైజాగ్ బీచ్‌లో క్లీన్ చేసి డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేసింది లావణ్య త్రిపాఠి. ప్రమోషన్స్‌లో భాగంగానే హీరో అభిజీత్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి గురించి చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ తెలుగు విన్నర్ అభిజీత్.

"లావణ్య త్రిపాఠి నటన అంటే నాకు ఇష్టం. తను మంచి కోస్టార్. ఆమెతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉండేది. మా మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చేసే క్రమంలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను, తను దాదాపు ఇద్దరం ఒకే టైమ్‌లో కెరీర్ స్టార్ట్ చేశాం. అయితే లావణ్య నాకంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. నేను ఈ సిరీస్ చేయడం మా ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. లావణ్య యాక్టింగ్‌ను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడతారు" అని అభిజీత్ తెలిపాడు.

"ఈ సిరీస్‌కు సుప్రియ గారు ప్రొడ్యూసర్ కావడం హ్యాపీగా ఉంది. నాకు మంచి కథ దొరికితే నేను ఆ కథను తీసుకెళ్లే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్‌లో సుప్రియ గారు ఒకరు. కానీ, నాకు బాగా అనిపించిన సబ్జెక్ట్ మాత్రమే అలా తీసుకెళ్తా. ఎందుకంటే ఒక ఫ్లాప్ సినిమా మంచి రిలేషన్ కూడా పోగొడుతుంది. అందుకే నేను సినిమా సెలెక్షన్‌లో జాగ్రత్తగా ఉంటా. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అధీప్ గారు మిస్ పర్ఫెక్ట్ కథ నెరేట్ చేసినప్పుడే చాలా హిలేరియస్‌గా అనిపించింది. నటిస్తున్నప్పుడు మేము ఆ మ్యాజిక్ ఫీల్ అయ్యాం. రేపు సిరీస్ చూస్తూ మీరు అదే ఫీలయితే మా టీమ్ అంతా సంతోషిస్తాం" అని అభిజీత్ అన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం