తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhola Shankar Update: భోళా శంక‌ర్ రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్‌ - ప‌క్కా అనుకున్న డేట్‌కు వ‌చ్చేస్తోన్న చిరు మూవీ

Bhola Shankar Update: భోళా శంక‌ర్ రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్‌ - ప‌క్కా అనుకున్న డేట్‌కు వ‌చ్చేస్తోన్న చిరు మూవీ

HT Telugu Desk HT Telugu

30 May 2023, 14:02 IST

  • Bhola Shankar Update: చిరంజీవి భోళా శంక‌ర్ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారంపై సినిమా యూనిట్ మంగ‌ళ‌వారం క్లారిటీ ఇచ్చింది.

చిరంజీవి భోళా శంక‌ర్
చిరంజీవి భోళా శంక‌ర్

చిరంజీవి భోళా శంక‌ర్

Bhola Shankar Update: చిరంజీవి (Chiranjeevi)భోళా శంక‌ర్ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తోన్నాయి. షూటింగ్ ఆల‌స్యం కావ‌డం, ర‌జ‌నీకాంత్ జైల‌ర్ పోటీగా రానుండ‌టంతో చిరంజీవి మూవీ రిలీజ్ డేట్ మారే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌ను చిత్ర యూనిట్ ఖండించింది.

ట్రెండింగ్ వార్తలు

Karthika deepam2:కార్తీకదీపం 2 సీరియల్..తండ్రిగా సంతకం ఎందుకు పెట్టారని నిలదీసిన దీప, నరసింహని అరెస్ట్ చేయించిన కార్తీక్

The Fall Guy OTT: రెండు వారాల్లోనే ఓటీటీలో రిలీజైన హాలీవుడ్ గిన్నిస్ రికార్డ్ మూవీ - స్టార్ హీరోకు షాక్‌

Pushpa 2 Second Song: పుష్ప 2 రెండో పాటపై అప్‍డేట్ వచ్చేస్తోంది.. మెలోడీకి రెడీ అవండి!

Yakshini OTT: బాహుబలి మేకర్స్ నుంచి యక్షిణి వెబ్ సిరీస్.. వేదిక ఫస్ట్ లుక్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ముందుగా ప్ర‌క‌టించిన డేట్ ప్ర‌కారం ఆగ‌స్ట్ 11నే భోళా శంక‌ర్ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు మంగ‌ళ‌వారం అనౌన్స్‌చేశారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

చిరంజీవి కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ముఖం క‌నిపించ‌కుండా వెనుక జేబుల్లో రెండు చేతులు పెట్టుకొని ఈ పోస్ట‌ర్‌లో చిరంజీవి క‌నిపిస్తోన్నాడు. ఒక పాట మిన‌హా భోళాశంక‌ర్‌ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో వేయ‌నున్న‌ గ్రాండియ‌ర్ సెట్‌లో బ్యాలెన్స్ సాంగ్‌ను షూట్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఇటీవ‌లే చిరంజీవి, త‌మ‌న్నాల‌పై స్విట్జ‌ర్లాండ్‌లో రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీక‌రించారు.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వేదాళం మూవీ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2013లో రిలీజైన షాడో త‌ర్వాత దాదాపు ప‌దేళ్ల విరామం త‌ర్వాత భోళా శంక‌ర్ సినిమాతో తిరిగి మెగా ఫోన్ ప‌ట్టాడు మెహ‌ర్ ర‌మేష్‌.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి యాక్ష‌న్ అంశాల‌ను మేళ‌వించి రూపొందిస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి సోద‌రిగా కీర్తిసురేష్ (Keerthy Suresh) న‌టిస్తోంది. త‌మ‌న్నా(Tamannaah) హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. కాగా భోళా శంకర్ రిలీజ్‌కు ఒక రోజు ముందు ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం