Keerthy Suresh Dasara Movie: ద‌స‌రా ద‌ర్శ‌కుడికి మాటిచ్చి త‌ప్పిన కీర్తిసురేష్-keerthy suresh recalls dasara director requested to me 12 kg weight reduce for vennela role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Keerthy Suresh Recalls Dasara Director Requested To Me 12 Kg Weight Reduce For Vennela Role

Keerthy Suresh Dasara Movie: ద‌స‌రా ద‌ర్శ‌కుడికి మాటిచ్చి త‌ప్పిన కీర్తిసురేష్

Nelki Naresh Kumar HT Telugu
Mar 26, 2023 09:26 AM IST

Keerthy Suresh Dasara Movie: మార్చి 30న రిలీజ్ కానున్న ద‌స‌రా సినిమాలో వెన్నెలగా ఢీ గ్లామ‌ర్ పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు సిద్ధ‌మైంది కీర్తిసురేష్‌. ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడికి ఓ మాటిచ్చి త‌ప్పిన‌ట్లు కీర్తిసురేష్ తెలిపింది. అదేమిటంటే...

కీర్తిసురేష్‌
కీర్తిసురేష్‌

Keerthy Suresh Dasara Movie: నాని (Nani), కీర్తిసురేష్ జంట‌గా న‌టించిన ద‌స‌రా సినిమా మార్చి 30న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో నాని, కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో వెన్నెల‌గా కంప్లీడ్ ఢీ గ్లామ‌ర్ రోల్‌లో కీర్తిసురేష్ న‌టిస్తోంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌లో కీర్తిసురేష్ లుక్‌, డైలాగ్స్ పై ప్ర‌శంస‌లు ల‌భిస్తోన్నాయి.

ద‌స‌రా సినిమాతో మ‌రోసారి కీర్తిసురేష్ నేష‌న‌ల్ అవార్డ్‌ను అందుకోవ‌డం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ అంటోన్నారు. కాగా ద‌స‌రా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న కీర్తిసురేష్‌ ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల‌కు ఓ మాట ఇచ్చి దానిని నిల‌బెట్టుకోలేక‌పోయాన‌ని చెప్పింది. ద‌స‌రా క‌థ‌తో పాటు వెన్నెల క్యారెక్ట‌ర్ గురించి చెప్పిన ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ఈ పాత్ర కోసం 12 కిలోల బ‌రువు త‌గ్గాల‌ని త‌న‌ను కోరిన‌ట్లు కీర్తిసురేష్ తెలిపింది.

కానీ ఒకేసారి 12 కిలోల బ‌రువు త‌గ్గి స్లిమ్ లుక్‌లోకి మారితే ప్ర‌స్తుతం న‌టిస్తోన్న మిగిలిన సినిమాల‌కు ఇబ్బంది అవుతుంద‌ని, అందుకే మూడు నుంచి ఐదు కిలోల వెయిట్ లాస్ అవుతాన‌ని ద‌ర్శ‌కుడితో చెప్పాన‌ని అన్న‌ది. అత‌డు త‌న స‌మ‌స్య‌ను అర్థం చేసుకొని క‌న్వీన్స్ అయిన‌ట్లు కీర్తిసురేష్ తెలిపింది. కానీ బ‌రువు త‌గ్గుతాన‌ని శ్రీకాంత్ ఓదెల‌కు ఇచ్చిన‌ ఆ మాట‌ను కూడా నిల‌బెట్టుకోలేక‌పోయాన‌ని, మూడు కిలోల బ‌రువు కూడా త‌గ్గ‌లేక‌పోయాన‌ని అన్న‌ది.

అదే విష‌యాన్ని షూటింగ్ అయిన త‌ర్వాత ద‌ర్శ‌కుడికి గుర్తు చేస్తే వెన్నెల‌ క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయిన తీరు చూసి ఆ విష‌య‌మే మ‌ర్చిపోయిన‌ట్లు ద‌ర్శ‌కుడు త‌న‌తో అన్నాడ‌ని కీర్తిసురేష్ పేర్కొన్న‌ది. ఈ సినిమా విష‌యంలో తాను అందుకున్న పెద్ద కాంప్లిమెంట్ అదేన‌ని పేర్కొన్న‌ది.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. నేను లోక‌ల్ త‌ర్వాత నాని, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

IPL_Entry_Point