NTR 100th Birth Anniversary: ఎన్టీఆర్ కారణ జన్ముడు.. భావితరాలకు స్ఫూర్తి.. తారకరాముడికి చిరంజీవి నివాళి-chiranjeevi remembers ntr legacy on his 100th birth anniverasary ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Remembers Ntr Legacy On His 100th Birth Anniverasary

NTR 100th Birth Anniversary: ఎన్టీఆర్ కారణ జన్ముడు.. భావితరాలకు స్ఫూర్తి.. తారకరాముడికి చిరంజీవి నివాళి

Maragani Govardhan HT Telugu
May 28, 2023 02:56 PM IST

NTR 100th Birth Anniversary: నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా సినీ ప్రముఖులు నివాళీ ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం తారకరాముడి గొప్పతనం గురించి ట్విటర్ వేదికగా తెలియజేశారు.

నందమూరి తారక రామారావు
నందమూరి తారక రామారావు

NTR 100th Birth Anniversary: విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. తారకరాముడి శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ఆయన నివాళి తెలిపారు. ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కీర్తిస్తూ ట్విటర్ వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. తాజాగా మన మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా నివాళీ తెలిపారు.

"నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకు గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ ఎన్టీఆర్. తెలుగు జాతీ ఘనకీర్తికి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు గారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ.." అంటూ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు తమ స్పందనను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాతను తలచుకుంటూ ట్వీట్ చేశారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతోంది. పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరోకసారి తాకిపో తాతా." అంటూ జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు.

సీనియర్ ఎన్టీఆర్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన తారకరాముడు తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. ఏ పాత్ర వేసిన అందులో ఆయన తప్ప మరొకరు మెప్పించలేరు అనేంతగా తన నటనతో ఆకట్టుకున్నారు. వెండితెరపై రారాజులా వెలుగొందిన ఎన్టీఆర్.. రాజకీయాల్లోనూ ప్రభంజనం సృష్టించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఎన్నో సంక్షేమ పథకాలకు నాంది పలికారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్