తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhagavanth Kesari: భగవంత్ కేసరి డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

Bhagavanth Kesari: భగవంత్ కేసరి డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

Hari Prasad S HT Telugu

27 November 2023, 18:55 IST

    • Bhagavanth Kesari: భగవంత్ కేసరి డైరెక్టర్‌ అనిల్ రావిపూడికి లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు ఈ సినిమా ప్రొడ్యూసర్లు. ఈ మూవీ అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో దుమ్ము రేపిన విషయం తెలిసిందే.
ఖరీడైన టొయోటా కారు అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి
ఖరీడైన టొయోటా కారు అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి

ఖరీడైన టొయోటా కారు అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి

Bhagavanth Kesari: భగవంత్ కేసరి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసింది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తర్వాత ప్రైమ్ వీడియోలో రిలీజై అక్కడా టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. దీంతో ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడికి ప్రొడ్యూసర్లు ఖరీదైన లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. భగవంత్ కేసరి సినిమాను నిర్మించిన షైన్ స్క్రీన్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఖరీదైన టొయోటా వెల్‌ఫైర్ కారును అందించింది. ఈ కారు ధర ఇండియాలో రూ.1.2 కోట్ల నుంచి రూ.1.3 కోట్లు ఉండటం విశేషం. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది.

ఇప్పటి వరకూ కామెడీ సినిమాలకే ప్రాధాన్యమిచ్చిన అనిల్ రావిపూడి.. ఈసారి కాస్త ఎమోషన్ కు కూడా జోడించి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ను తెరకెక్కించాడు. ఇందులో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించగా.. సీనియర్ నటి కాజల్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన తర్వాత ఈ మధ్యే ఓటీటీలోనూ రిలీజైంది.

ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ మూవీగా భగవంత్ కేసరి నిలవడం విశేషం. ఫ్యామిలీ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోంది. ఇంత పెద్ద హిట్ అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి కలిసి పని చేయడానికి షైన్ స్క్రీన్ మీడియా ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

భ‌గ‌వంత్ కేస‌రి ప‌క్కా బాల‌కృష్ణ మార్క్ మూవీ. ఆయ‌న శైలి మాస్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు రివేంజ్ డ్రామాను జోడించి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ క‌థ‌ను రాసుకున్నాడు. బాల‌కృష్ణ‌, శ్రీలీల ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా సినిమా సాగుతుంది. బాల‌కృష్ణ‌కు ఇలాంటి సినిమాలు కొత్త కాదు.

డైరెక్ట‌ర్‌గా అనిల్ రావిపూడి మాత్రం త‌న పంథాకు భిన్నంగా ఫ‌స్ట్‌టైమ్ మాస్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా చేశాడు. క‌థ లాజిక్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి బాలకృష్ణ‌లోని హీరోయిజం ద్వారా పాస్ మార్కులు కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించాడు అనిల్ రావిపూడి. తెలంగాణ స్లాంగ్‌, డైలాగ్స్ సినిమా అడ్వాంటేజ్‌గా నిలిచాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం