Bhagavanth Kesari Review: భ‌గ‌వంత్ కేస‌రి రివ్యూ - తెలంగాణ క‌థ‌తో బాల‌కృష్ణ హిట్ కొట్టాడా?-bhagavanth kesari review balakrishna sreeleela mass action movie review kajal aggarwal anil ravipudi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bhagavanth Kesari Review Balakrishna Sreeleela Mass Action Movie Review Kajal Aggarwal Anil Ravipudi

Bhagavanth Kesari Review: భ‌గ‌వంత్ కేస‌రి రివ్యూ - తెలంగాణ క‌థ‌తో బాల‌కృష్ణ హిట్ కొట్టాడా?

HT Telugu Desk HT Telugu
Oct 19, 2023 01:02 PM IST

Bhagavanth Kesari Review: బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భ‌గ‌వంత్ కేస‌రి మూవీ గురువారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. శ్రీలీల‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

భ‌గ‌వంత్ కేస‌రి మూవీ
భ‌గ‌వంత్ కేస‌రి మూవీ

Bhagavanth Kesari Review: టాలీవుడ్‌లో మాస్, యాక్ష‌న్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తుంటారు బాల‌కృష్ణ‌ (Balakrishna). కామెడీ క‌థల‌కు పెట్టింది పేరు అనిల్ రావిపూడి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన తాజా సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా గురువారం భారీ అంచ‌నాల న‌డమ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) కీల‌క పాత్ర పోషించింది. ద‌స‌రా కానుక‌గా బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన ఈ సినిమా ఎలా ఉంది? బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారా? లేదా? అన్నది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

వ‌రంగ‌ల్ ఖైదీ క‌థ‌...

వ‌రంగ‌ల్ జైల‌ర్ శ్రీకాంత్ (శ‌ర‌త్‌కుమార్‌) ఓ యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడు. అత‌డి కూతురు విజ్జీని (శ్రీలీల‌) కంటికి రెప్పాలా కాపాడుతుంటాడు జైలు ఖైదీ అయిన నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి (బాల‌కృష్ణ‌). శ్రీకాంత్ కోరిక మేర‌కు విజ్జీ పాప‌ను ఆర్మీలో జాయిన్ చేయాల‌నుకుంటాడు భ‌గ‌వంత్ కేస‌రి. ఆర్మీలో జాయిన్ కావ‌డం విజ్జీకి ఇష్టం ఉండ‌దు. త‌న క్లాస్‌మేట్‌ను ప్రేమించిన విజ్జీ అతడిని పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది.

కానీ బ‌ల‌వంతంగా విజ్జీకి ఆర్మీ శిక్ష‌ణ‌ను ఇప్పిస్తుంటాడు భ‌గ‌వంత్ కేస‌రి. విజ్జీని చంపేందుకు రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్‌) అనే బిజినెస్‌మెన్ ప్ర‌య‌త్నిస్తుంటాడు? విజ్జీని అత‌డు ఎందుకు చంపాల‌ని అనుకున్నాడు? రాహుల్ సంఘ్వీ బారి నుంచి విజ్జీ భ‌గ‌వంత్ కేస‌రి ఎలా కాపాడాడు? సిన్సియ‌ర్ ఫోలీస్ ఆఫీస‌ర్ అయిన భ‌గ‌వంత్ కేస‌రి ఖైదీగా ఎందుకు మారాడు? అనుక్ష‌ణం విజ్జీ భ‌యంతో బ‌త‌క‌డానికి కార‌ణం ఏమిటి? భ‌గ‌వంత్ కేస‌రి, విజ్జీ జీవితంలోకి కాత్యాయిని (కాజ‌ల్ అగ‌ర్వాల్‌) ఎలా వ‌చ్చింది అన్న‌దే ఈ(Bhagavanth Kesari Review) సినిమా క‌థ‌.

రివేంజ్ డ్రామా...

భ‌గ‌వంత్ కేస‌రి ప‌క్కా బాల‌కృష్ణ మార్క్ మూవీ. ఆయ‌న శైలి మాస్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు రివేంజ్ డ్రామాను జోడించి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ క‌థ‌ను రాసుకున్నాడు. బాల‌కృష్ణ‌, శ్రీలీల ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా సినిమా సాగుతుంది. బాల‌కృష్ణ‌కు ఇలాంటి సినిమాలు కొత్త కాదు.

డైరెక్ట‌ర్‌గా అనిల్ రావిపూడి మాత్రం త‌న పంథాకు భిన్నంగా ఫ‌స్ట్‌టైమ్ మాస్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా చేశాడు. క‌థ లాజిక్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి బాలకృష్ణ‌లోని హీరోయిజం ద్వారా పాస్ మార్కులు కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించాడు అనిల్ రావిపూడి. తెలంగాణ స్లాంగ్‌, డైలాగ్స్ సినిమా(Bhagavanth Kesari Review) అడ్వాంటేజ్‌గా నిలిచాయి.

ఖైదీగా ఎంట్రీ...

జైలులో ఖైదీగా బాల‌కృష్ణ ఎంట్రీతోనే భ‌గ‌వంత్ కేస‌రి సినిమా(Bhagavanth Kesari Review) మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత విజ్జీ పాప‌తో అత‌డి అనుబంధం, విజ్జీ ప్రేమ‌ను కాద‌ని, ఆమెను భ‌గ‌వంత్ కేస‌రి ఆర్మీ చేర్పించాల‌ని అనుకునే సీన్స్‌తో ఫ‌స్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగుతుంది. తాను వెతుకుతోన్న శ‌త్రువు, విజ్జీ చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఒక‌రేన‌ని భ‌గ‌వంత్ కేస‌రి తెలుసుకునే ట్విస్ట్‌తోనే ఫ‌స్ట్‌హాఫ్ ఎండ్ అవుతుంది. భ‌గ‌వంత్ కేస‌రి ఫ్లాష్‌బ్యాక్‌, రాహుల్ సంఘ్విపై అత‌డు ప్ర‌తీకారం తీర్చుకునే ఎపిసోడ్స్‌తో సెకండాఫ్‌ను ముందుకు న‌డిపించారు అనిల్ రావిపూడి.

నో లాజిక్స్‌...

రొటీన్ రివేంజ్ డ్రామా మూవీ ఇది. నిజాయితీప‌రుడైన హీరోను విల‌న్ అన్యాయంగా జైలుకు పంపించ‌డం, అత‌డిపై హీరో ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం అనే పాయింట్‌తో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. ఆ పాయింట్‌తోనే భ‌గ‌వంత్ కేస‌రి క‌థ సాగుతుంది. బాల‌కృష్ణ‌, శ్రీలీల ఎపిసోడ్స్ కొన్ని చోట్ల సాగ‌దీసిన అనుభూతిని క‌లిగిస్తాయి. కాజ‌ల్ అగ‌ర్వాల్ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. లాజిక్స్ గురించి అస‌లు ఆలోచించాల్సిన ప‌నిలేదు.

భ‌గ‌వంత్ కేస‌రిగా...

భ‌గ‌వంత్ కేస‌రి పాత్ర‌లో బాల‌కృష్ణ చెల‌రేగిపోయాడు. తెలంగాణ యాస‌లో అత‌డు చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. లుక్‌, గెట‌ప్ వైవిధ్యంగా ఉన్నాయి. విజ్జీ పాప పాత్ర‌లో శ్రీలీల ఆక‌ట్టుకుంటుంది. అల్ల‌రి అమ్మాయిగా ఆమె న‌ట‌న మెప్పిస్తుంది. ఫ‌స్ట్ హాఫ్‌లో ఫ‌న్నీగా, సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్‌గా శ్రీలీల క్యారెక్ట‌ర్ సాగుతుంది. కాజ‌ల్ పాత్ర పెద్ద‌గా ఎలివేట్ కాలేదు. స్టైలిష్ విల‌న్‌గా అర్జున్ రాంపాల్‌, శ్రీలీల తండ్రిగా శ‌ర‌త్‌కుమార్ ఒకే అనిపించారు. క‌థ‌కుడిగా కంటే డైరెక్ట‌ర్‌గా అనిల్ రావిపూడికి ఈ సినిమాతో ఎక్కువ‌గా మార్కులు ప‌డ‌తాయి.

Bhagavanth Kesari Review - ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్‌...

భ‌గ‌వంత్ కేస‌రి బాల‌కృష్ణ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్‌లా ఉంటుంది. కొత్త బాల‌య్య‌ను ఈ సినిమా చూస్తారు. ద‌స‌రాకు విందు భోజ‌నంలా భ‌గ‌వంత్ కేస‌రి అలరిస్తుంది.

WhatsApp channel