తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna: అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 వచ్చేస్తోంది....అఫిషీయల్ గా ప్రకటించిన ఆహా

Balakrishna: అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 వచ్చేస్తోంది....అఫిషీయల్ గా ప్రకటించిన ఆహా

HT Telugu Desk HT Telugu

20 June 2022, 14:27 IST

  • నేను మీకు తెలుసు..మీ స్థానం నా మ‌న‌సు అంటూ అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో అభిమానుల‌ను మెప్పించారు బాల‌కృష్ణ‌. మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ టాక్ షోగా అన్‌స్టాప‌బుల్ నిలిచింది. తాజాగా ఈ టాక్ షో రెండో సీజ‌న్ పై ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కీల‌క‌మైన అప్‌డేట్‌ను వెల్ల‌డించింది. అదేమిటంటే...

బాల‌కృష్ణ‌
బాల‌కృష్ణ‌ (twitter)

బాల‌కృష్ణ‌

అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో హోస్ట్‌గా కొత్త‌ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టారు బాల‌కృష్ణ‌. ఈ షో మొద‌ల‌య్యే స‌మ‌యంలో సెల‌బ్రిటీల‌ను బాల‌కృష్ణ ఎలా ఇంట‌ర్వ్యూలు చేస్తారు? షో స‌క్సెస్ అవుతుందా లేదా అంటూ ఏన్నో సందేహాలు, ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. కానీ అంద‌రి అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ ఈ షోను స‌క్సెస్ చేశారు బాల‌కృష్ణ‌. త‌న‌దైన శైలి కామెడీ టైమింగ్‌, చిలిపిత‌నంతో ఈ షోకు విచ్చేసిన హీరోలు, ద‌ర్శ‌కుల్ని ఆట‌ప‌ట్టిస్తూనే వారి నుండి త‌న‌కు కావాల్సిన స‌మాధానాల‌ను రాబట్టుకున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

నేను మీకు తెలుసు..నా స్థానం మీ మ‌న‌సు అంటూ ఈ టాక్ షోతో బాల‌కృష్ణ మెప్పించారు. ర‌వితేజ‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు హీరోల‌తో త‌న‌కు విభేదాలు ఉన్నాయంటూ వ‌స్తోన్న వార్త‌ల‌కు కూడా ఈ షో ద్వారానే స‌మాధానం చెప్పారు బాల‌కృష్ణ‌. సీజ‌న్ వ‌న్ లో బాల‌కృష్ణ చేసిన ప్ర‌తి ఇంట‌ర్వ్యూ హైలైట్ గా నిలిచింది. ఈ షోతో ఆయ‌న ఇమేజ్ రెట్టింపు కావ‌డ‌మే కాకుండా కొత్త బాల‌య్య‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. దాంతో అన్‌స్టాప‌బుల్ రెండో సీజ‌న్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 

వారికి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ గుడ్‌న్యూస్ వినిపించింది. త్వ‌ర‌లోనే రెండో సీజ‌న్ ప్రారంభం కాబోతున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇండియ‌న్ ఐడ‌ల్ తెలుగు షోకు బాల‌య్య గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో అన్‌స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్ ప్రారంభం ఎప్పుడూ అని బాల‌కృష్ణ‌ను యాంక‌ర్ శ్రీరామ‌చంద్ర ప్ర‌శ్న అడిగారు. దానికి బాల‌య్య త్వ‌ర‌లోనే అంటూ స‌మాధానం చెప్ప‌డం ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాల‌కృష్ణ‌. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం