తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna 107: పులిచర్ల నాలుగు కిలోమీటర్ల దూరంలో...ఆకట్టుకుంటున్న బాలకృష్ణ 107 మూవీ పోస్టర్...

Balakrishna 107: పులిచర్ల నాలుగు కిలోమీటర్ల దూరంలో...ఆకట్టుకుంటున్న బాలకృష్ణ 107 మూవీ పోస్టర్...

09 June 2022, 8:58 IST

  • అఖండ ఘ‌న విజ‌యం త‌ర్వాత ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఓ సినిమా చేస్తున్నారు బాల‌కృష్ణ‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం సాయంత్రం విడుదలచేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. టీజర్ రిలీజ్ టైమ్ ను వెల్లడించిన చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నది. 

బాల‌కృష్ణ‌
బాల‌కృష్ణ‌ (twitter)

బాల‌కృష్ణ‌

అఖండ‌తో గ‌త ఏడాది పెద్ద విజ‌యాన్ని అందుకున్నారు బాల‌కృష్ణ‌. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం బాల‌కృష్ణ కెరీర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ స‌క్సెస్ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేయ‌బోతున్నారు బాల‌కృష్ణ‌. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

ట్రెండింగ్ వార్తలు

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

ఫ‌స్ట్ హంట్ పేరుతో ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. పులిచర్ల నాలుగు కిలోమీటర్ల దూరం అనే మైలురాయి ఫొటోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మైలురాయి పక్కనే రక్తంతో తడిసిన గొడ్డలి కనిపించడం ఆసక్తిని పంచుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది.

బాల‌కృష్ణ శైలి మాస్ హంగులు,డైలాగ్ ల‌తో ప‌వ‌ర్ ఫుల్‌గా టీజర్ ఉంటుందని చెబుతున్నారు. బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న 107వ సినిమా ఇది. ఇందులో శృతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్ పాత్ర‌ను పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం