తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ar Rahman: అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే సింగర్ ఏఆర్ రెహమాన్.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

AR Rahman: అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే సింగర్ ఏఆర్ రెహమాన్.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

Hari Prasad S HT Telugu

29 June 2023, 15:46 IST

    • AR Rahman: అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే సింగర్ గా ఏఆర్ రెహమాన్ నిలిచాడు. అతడు ఒక్కో పాటకు అందుకునే మొత్తం చూస్తే ఎవరైనా కళ్లు తేలేయాల్సిందే.
ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ (twitter)

ఏఆర్ రెహమాన్

AR Rahman: ఏఆర్ రెహమాన్ దేశం గర్వించదగిన మ్యూజిక్ కంపోజర్. ఇండియా నుంచి తొలి ఆస్కార్ గెలిచిన సంగీత దర్శకుడు. అయితే దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న సింగర్ కూడా అతడే అన్న విషయం మీకు తెలుసా? మనకు సింగర్స్ అంటే అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్, సచేత్ టాండన్ లాంటి వాళ్లు గుర్తుకు వస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

ముఖ్యంగా అరిజిత్ సింగ్ కు ఉన్న క్రేజ్ చూస్తే అతడు అత్యధిక మొత్తం అందుకునే సింగర్ అనుకుంటాం. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ లిస్టులో రెహమాన్ టాప్ లో ఉన్నాడు. ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క పాట పాడటానికి రూ.3 కోట్లు తీసుకుంటాడంటే నమ్మగలరా? దేశంలోనే అత్యధిక మొత్తం అందుకున్న సింగర్ గా రెహమాన్ నిలవడం విశేషం.

ఒక్కో పాటకు ఈ స్థాయిలో అందుకునే మరో సింగర్ లేడు. కనీసం అతని దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారు. ఇంత భారీ మొత్తం తీసుకుంటాడనో ఏమో ఏ ప్రొడ్యూసర్ అతనితో పాడించడానికి సాహసం చేయరు. రెహమాన్ కూడా కేవలం తాను మ్యూజిక్ కంపోజ్ చేసే సినిమాల్లో పాడటం మనం చూస్తూనే ఉంటాం. అతడు మ్యూజిక్ అందించిన లేటెస్ట్ మూవీ మామన్నన్ గురువారం (జూన్ 29) రిలీజైంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రెహమాన్ మ్యూజిక్ అందివ్వడం మొదలుపెట్టి 30 ఏళ్లకుపైనే అయింది. 1992లో వచ్చిన రోజా మూవీ అతని కెరీర్లో మొదటిది. ఆ సినిమాతోనే రెహమాన్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత బాంబే, ప్రేమికుడు, రంగీలా, దిల్ సే, తాళ్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకిగాను రెండు ఆస్కార్స్ అందుకున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం