తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Huge Milestone: అల్లు అర్జున్ అరుదైన ఘనత.. తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు

Allu Arjun Huge Milestone: అల్లు అర్జున్ అరుదైన ఘనత.. తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు

02 March 2023, 20:06 IST

    • Allu Arjun Huge Milestone: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత సాధించారు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. 20 మిలియన్ల ఫాలోవర్లతో ఈ ఘనత సాధించిన తొలి సౌత్ హీరోగా రికార్డు సృష్టించారు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల్లు అర్జున్

Allu Arjun Huge Milestone: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా స్టైలిష్ స్టార్‌ను అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు. పుష్ప సినిమాతో ఆ క్రేజ్ ఇంకా ఆమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతంగా ఫాలోయిగ్ ఉంది. ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేసిన అది ట్రెండింగ్‌లో నిలుస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ అరుదైన ఘనత సాధించారు. సౌత్ ఇండియాలో అత్యధిక ఫాలోవర్లను కలిగిన హీరోగా రికార్డు సృష్టించారు.

ట్రెండింగ్ వార్తలు

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ అరుదైన మైలురాయి అందుకున్నారు. 20 మిలియన్(2 కోట్లు) ఫాలోవర్లతో రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించి తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు సాధించాడు. ఎక్కువ ఫాలోవర్లున్న జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

స్వతహాగా ఫ్యామిలీ పర్సన్ అయిన అల్లు అర్జున్ తన అభిమానులకు ఎప్పుడూ చేరువగా ఉంటారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేస్తుంటారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు చురుకుగా ఉంటారు. తన ఫ్యామిలీ గురించి, భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ గురించి ఫొటోలను వీడియోలను షేర్ చేస్తుంటారు. ఎక్కువగా కుమార్తే అర్హతో ఉన్న ఫన్నీ వీడియోలను ఆయన పంచుకుంటారు.

తాజాగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అరుదైన ఘనత సాధించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్సకత్వంలో పుష్ప:ది రూల్ చిత్రంలో నటిస్తున్నారు. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పుష్ప చిత్రంలో తన మేనరిజంతో ప్రేక్షకులను విపరీతంగా అలరించారు మన స్టైలిష్ స్టార్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం