తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rai On Salman: బాలీవుడ్‌లో సెక్సీయెస్ట్ మ్యాన్ సల్మాన్ ఖాన్ అంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు.. వీడియో వైరల్

Aishwarya Rai on Salman: బాలీవుడ్‌లో సెక్సీయెస్ట్ మ్యాన్ సల్మాన్ ఖాన్ అంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు.. వీడియో వైరల్

12 April 2023, 12:16 IST

    • Aishwarya Rai on Salman: బాలీవుడ్ సెక్సీయెస్ట్ మ్యాన్ ఎవరంటే సల్మాన్ ఖాన్ అంటూ ఐశ్వర్య రాయ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చాలా పాతది. ఒకప్పుడు ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
ఐశ్వర్య రాయ్-సల్మాన్ ఖాన్
ఐశ్వర్య రాయ్-సల్మాన్ ఖాన్

ఐశ్వర్య రాయ్-సల్మాన్ ఖాన్

Aishwarya Rai on Salman: ఐశ్వర్య రాయ్ బచ్చన్-సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో వీరిది ఒకప్పుడు పాపులర్ పెయిర్. ఇద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలారు. సల్మాన్.. ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు అప్పట్లో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇద్దరూ విడిపోయారు. ఐశ్వర్య.. అభిషేక్‌ను వివాహం చేసుకుని తన జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఎప్పుడైనా ఏదైనా పార్టీలో సల్మాన్, ఐశ్వర్య కనిపించినా చూసి చూడనట్లుగా వ్యవహరించేవాళ్లు. ఇటీవల ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నిర్వహించిన కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్‌లోనూ వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‍‌లో కనిపించారు. అయినా మాట్లాడుకున్నది లేదు.

ట్రెండింగ్ వార్తలు

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ పాత ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సల్మాన్.. బాలీవుడ్‌లోనే సెక్సియెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ మ్యాన్‌గా అభివర్ణించింది. బాలీవుడ్‌లో సెక్సీగా, అందంగా ఉండే వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించగా.. ఐశ్వర్య చాలా సేపు ఆలోచించి.. సిగ్గుపడుతూ సరే అంతర్జాతీయంగా భారతీయ పురుషుల జాబితాలో స్పష్టంగా ఎంపికైన సల్మాన్‌ను తీసుకుందాం అంటూ బదులిచ్చింది. ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తొలిసారిగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హమ్ దిల్ దే చుకే సనమ్ అనే సినిమాలో కలిసి నటించారు. ఇందులో ప్రధాన పాత్రలో అజయ్ దేవగణ్ నటించారు. ఈ సినిమాతో పరిచయం సల్మాన్, ఐశ్వర్య మధ్య స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అది సాధ్యం కాలేదు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసి కా జాన్ అనే ప్రాజెక్టులో నటించాడు. ఇది రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. దీని తర్వాత టైగర్ 3, టైగర్ vs పఠాన్ లాంటి పలు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. మరోపక్క ఐశ్వర్య రాయ్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ 2లో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం