తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush: ఆదిపురుష్ మూవీపై ఎంపీ ఆగ్రహం.. ఆ విషయంపై తీవ్ర అభ్యంతరం

Adipurush: ఆదిపురుష్ మూవీపై ఎంపీ ఆగ్రహం.. ఆ విషయంపై తీవ్ర అభ్యంతరం

17 June 2023, 14:22 IST

    • Adipurush: ఆదిపురుష్ సినిమాలోని డైలాగ్‍లపై ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. డైలాగ్ రైటర్, దర్శకుడు.. దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదిపురుష్ పోస్టర్
ఆదిపురుష్ పోస్టర్

ఆదిపురుష్ పోస్టర్

Adipurush: ఆదిపురుష్ సినిమా శుక్రవారం (జూన్ 16) థియేటర్లలో విడుదలైంది. రామాయణం ఆధారం ఔం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీరాముడిగా స్టార్ హీరో ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. మొదటి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు భారీ కలెక్షన్లను సాధించింది. అయితే, ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఆదిపురుష్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని కొందరు ప్రేక్షకులు అంటుంటే.. మరికొందరేమో గ్రాఫిక్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. తాజాగా శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ఈ సినిమాను ఓ అంశంలో విమర్శించారు. సినిమా యూనిట్ దేశానికి క్షమాపణలు చెప్పాలని శనివారం డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

ఆదిపురుష్ సినిమాలోని డైలాగ్‍లపై ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొలిచే దేవుళ్లకు ఎంటర్‌టైన్‍మెంట్ పేరుతో అభ్యంతర పదాలను వాడడం సరికాదంటూ ట్వీట్ చేశారు. “ఆదిపురుష్ సినిమా కోసం.. ముఖ్యంగా హనుమంతుడి కోసం వినియోగించిన కొన్ని దిగజారుడు డైలాగ్‍ల పట్ల ఈ మూవీ డైలాగ్ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ శుక్లాతో పాటు దర్శకుడు కూడా దేశానికి క్షమాపణలు చెప్పాలి. మనం నిత్యం పూజించే దేవుళ్లకు ఎంటర్‌టైన్‍మెంట్ పేరుతో అలాంటి భాషను వినియోగించడం భారతీయులందరి మనోభావాలను దెబ్బతీస్తోంది. మీరు మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడిపై సినిమా తీశారు. అయితే, బాక్సాఫీస్ సక్సెస్ కోసం మర్యాద అనే హద్దులను అతిక్రమించారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు” అని ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.

ఆదిపురుష్ మూవీలో లంకకు వెళ్లిన సమయంలో హనుమంతుడు చెప్పే కొన్ని డైలాగ్‍లపై ఇప్పటికే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేవుడికి అలాంటి డైలాగ్స్ పెడతారా అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఆదిపురుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.130కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఓపెనింగ్ డే ఈ మూవీకి భారీ కలెక్షన్లు దక్కాయి. కొందరి నుంచి టాక్ కూడా బాగానే ఉండటంతో కలెక్షన్ల విషయంలో దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా రావణుడి గెటప్, ఆ పాత్రకు వాడిన వీఎఫ్ఎక్స్ విషయంలో మీమ్స్ పేలుతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం