తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha New House : హైదరాబాద్‌లో లగ్జరీ ఇల్లు కొన్న సమంతా.. ధర ఎంతంటే?

Samantha New House : హైదరాబాద్‌లో లగ్జరీ ఇల్లు కొన్న సమంతా.. ధర ఎంతంటే?

Anand Sai HT Telugu

10 May 2023, 7:19 IST

    • Samantha New House : నటి సమంతా హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ఇల్లు కొన్నారు. ఈ ఇల్లు ధర భారీగానే ఉంది. కొత్త ఇంటి ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు.
సమంతా
సమంతా

సమంతా

ఇటీవల సమంతా(Samantha) నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. అయినా కూడా ఆమె డిమాండ్ తగ్గలేదు. సమంత నటించిన యశోద(Yashoda), శాకుంతలం చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. అంతకు ముందు నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన కథువక్కు రెండు కాదల్ సినిమా కూడా హిట్ కాలేదు. అయినా కూడా డిమాండ్ తగ్గలేదు. సినిమాకి సినిమాకి రెమ్యునరేషన్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే సామ్ కూడా ఆస్తుల మీద ఆస్తులు కొంటోంది.

ట్రెండింగ్ వార్తలు

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

విడాకులకు ముందు సమంతా, నాగ చైతన్య(Samantha-Naga Chaitanya) ఒకే ఇంట్లో కలిసి జీవించారు. విడాకుల తర్వాత ఆ ఇంటినే కొనుగోలు చేసి అక్కడే నివసించింది. తాజాగా హైదరాబాద్‌లోని ఓ రిచ్ ఏరియాలో లగ్జరీ ఇంటిని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

7944 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు పడక గదుల డ్యూప్లెక్స్ హౌస్‌ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. నగరంలోని జయభేరీ ఆరంజ్‌ కౌంటీలో ఖరీదైన ఫ్లాట్ సమంతా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తులో తీసుకుందట. ఈ డూప్లెక్స్ హౌస్ కోసం రూ.7.8 కోట్లు చెల్లించిందట.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలాటియల్ హౌస్‌లో సమంత నివాసం ఉంటోంది. నాగ చైతన్యను వివాహం చేసుకున్నప్పుడు ఒక ప్రముఖ నటుడి నుండి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. విడాకుల తర్వాత, ఇల్లు అమ్మేయగా.., సమంతా భారీ మొత్తంలో డబ్బు చెల్లించి, ఆ ఇంటిని తిరిగి కొనుగోలు చేసి అక్కడే నివసిస్తుంది.

సమంతా మొత్తం ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉండొచ్చని అంచనా. ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు తీసుకుంటుంది. ఇది కాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలను ఇస్తే.. భారీ మొత్తంలో అందుకుంటోంది. ఇంటితో పాటు ఆమెకు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ల్యాండ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూ 7తో సహా కొన్ని లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేసింది. వెంచర్లలో పెట్టుబడి పెట్టింది.

సమంతా ప్రస్తుతం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ఖుషీ సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో చేస్తోంది. ఆ తర్వాత అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం