Vijay Deverakonda: రాయలసీమ కథతో విజయ్ దేవరకొండ మూవీ - డైరెక్ట‌ర్ ఎవ‌రంటే-vijay deverakonda to join hands with taxiwala director rahul sankrityan once again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: రాయలసీమ కథతో విజయ్ దేవరకొండ మూవీ - డైరెక్ట‌ర్ ఎవ‌రంటే

Vijay Deverakonda: రాయలసీమ కథతో విజయ్ దేవరకొండ మూవీ - డైరెక్ట‌ర్ ఎవ‌రంటే

Nelki Naresh Kumar HT Telugu
May 10, 2023 05:49 AM IST

Vijay Deverakonda: టాక్సీవాలా ద‌ర్శ‌కుడితో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ జోన‌ర్‌లో ఈ సినిమా రానుందంటే....

విజ‌య్ దేవ‌ర‌కొండ
విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Deverakonda: టాక్సీవాలా తో త‌న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమా చేయ‌బోతున్నట్లు సమాచారం. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా హార‌ర్ కామెడీ క‌థాంశంతో 2018లో రిలీజైన టాక్సీవాలా మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా తొలి విజ‌యాన్ని అందుకున్నాడు రాహుల్ సాంకృత్యాన్‌. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు స‌మాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక‌ల్ డ్రామా క‌థాంశంతో ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో విజ‌య్ ఈ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇందులో యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రెండేళ్ల నుంచి రాహుల్ సాంకృత్యాన్ ఈ క‌థ‌ను సిద్ధం చేస్తోన్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైన‌ల్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తోన్న‌ట్లు చెబుతోన్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ సినిమా సెట్స్‌పైకి రానున్న‌ట్లు స‌మాచారం.

విజ‌య్‌, రాహుల్ సాంకృత్యాన్ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతున్న‌ట్లు తెలిసింది. డియ‌ర్ కామ్రేడ్‌, ఖుషి త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ చేయ‌నున్న‌ మూడో సినిమా ఇది కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాగా ప్ర‌స్తుతం విజ‌య్ ఖుషి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ప్యూర్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో స్పై యాక్ష‌న్ మూవీ చేయ‌బోతున్నాడు విజ‌య్. వీటితో పాటుగా ప‌ర‌శురామ్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

IPL_Entry_Point