తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr On Congress: నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఆగమైందన్న కేసీఆర్‌, ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్‌ఎస్‌దే అధికారం

KCR on Congress: నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఆగమైందన్న కేసీఆర్‌, ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్‌ఎస్‌దే అధికారం

HT Telugu Desk HT Telugu

06 May 2024, 6:09 IST

    • KCR on Congress: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మర్లపడ్డారని బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోలేదని...తెలంగాణ పునఃర్నిర్మాణం మిగిలి ఉందని దాన్ని పూర్తి చేయాల్సిన బాద్యత తమపై ఉందని స్పష్టం చేశారు.
కరీంనగర్‌  ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
కరీంనగర్‌ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

కరీంనగర్‌ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

KCR on Congress: తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మధ్యలో వచ్చినా, కోసకొచ్చిన బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంచిర్యాలలో శనివారం బస్సుయాత్ర రోడ్ షో తో ప్రచారం నిర్వహించిన కేసీఆర్ రాత్రి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వీణవంకలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో బస చేశారు.

ఆదివారం మద్యాహ్నం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేసీఆర్ , అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి సింపుల్ మాట...మనోళ్లకు అలవాటు.. జర మంచిగ కాగానే ఉబ్బుడు... జర ఎటమటం కాగానే చంపుడు... అలానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అనగానే అత్యాశకు పోయి ఓట్లు వేసి కాంగ్రెస్ గెలిపించారని తెలిపారు.

తద్వారా తెలంగాణ ప్రజలు మర్లపడ్డారని తెలిసిపోయిందన్నారు. ఇది తాత్కాలికంగా సెట్ బ్యాక్ మాత్రమేనని, రాజకీయాల్లో ఉండేవారికి గుండేనిబ్బరం ఉండాలి.. గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. మనం పనిచేసే బాకీ ఉంది. మనకే భవిష్యత్తు ఉందన్నారు

తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేసిందన్న కేసీఆర్‌…

కాంగ్రెస్ అధికారంలలోకి వచ్చిన నాలుగైదు నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిందని కేసిఆర్ ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధ కలిగించింది.. కన్నీళ్ళు వచ్చాయని కేసిఆర్ ఆవేధన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ స్వల్ప వ్యవదిలోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకుందననుకోలేదన్నారు.

కోసముట్టే ప్రభుత్వం కాదన్నారు. బిఆర్ఎస్ హయాంలో ఐటి పరిశ్రమల రంగంలో తెలంగాణ కు బ్రహ్మాండంగా పెట్టుబడులు వచ్చేది...నరేంద్ర మోడీ అసూయ పడేలా పెట్టుబడులు వచ్చాయి.. కానీ ఈరోజు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాస్ వెళ్లిపోయిందన్నారు. అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు పెడుతుందని తెలిపారు.

24 గంటలు నిరంతరాయంగా కరెంట్, 365 రోజులు నీటిసప్లై చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమలేదు కాబట్టే ఇలాంటి దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి. మళ్లీ మనం వస్తేనే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయని మనం బాగపడుతామన్నారు.

కేంద్రం ఆడుకుంటుంది...

తెలంగాణలో నిరర్ధకమైన ప్రభుత్వం ఉండడంతో కేంద్రం ఆడుకుంటుందన్నారు కేసిఆర్. గోదావరి నీళ్ళు తమిళనాడు, కర్నాటకకు తరలించుకుపోయే ప్రతిపాదనను కేంద్రం పంపింది.. దానిపై సీఎం కుయ్యిలేదు.. కుక్కు లేదు.. నేనున్నప్పుడు ప్రతిపాధన పంపితే గోదావరి వాటర్ లో తమ వాటా ఎంటో తేల్చుమని చెప్పానని వాటా తేల్చేదాకా లక్ష మీటింగులు పెట్టినా నేను రాను ఏం పీక్కుంటవో పీక్కోమని చెప్పానని స్పష్టం చేశారు.

ఇప్పుడు నిరర్ధక ప్రభుత్వం ఉండటంటతో మళ్ళీ ఇప్పుడు ఆ ఫైల్ తో ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటున్నారని తెలిపారు. పార్లమెంట్ లో మనోళ్లే 12-14 మంది ఉంటే నీళ్లు ఎట్లా తీసుకుపోతవని మనోళ్లు గొంతుపట్టుకుంటారని తెలిపారు.

వ్యవసాయ స్థిరీకరణపై దృష్టి…

అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి రైతులు బయటపడేలా ఓ కొత్త ఆలోచన చేసినామని కేసిఆర్ తెలిపారు. ముందుగా ఎరువుల బస్తాలు ఉచితంగా ఇద్దామని అనుకున్నాం.. కానీ ఎరువులివ్వడం కంటే... డబ్బులు ఇస్తే బాగుంటుందని కొందరు నిపుణులు సూచించారు. ఆ డబ్బులకు రైతులే యజమానులు కావాలని చెప్పారు. ఆ ఆలోచన నుంచి దేశంలోనే మొదటిసారిగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.

బ్యాంకులో సర్కారు డబ్బులేస్తే నేరుగా రైతు ఖాతాల్లోంచి తీసుకునే వీలు కల్పించామని చెప్పారు. రైతుబంధుతో పాటు, నిరంతర విద్యుత్, కాళేశ్వర ప్రాజెక్టుతో సాగునీళ్ళు ఇచ్చామని, రైతు దురదృష్టవాశాత్తు చనిపోతే 5 లక్షలు ఇచ్చేలా రైతు బీమా తెచ్చామని తెలిపారు.

రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేలా ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి పంజాబ్ తలదన్నే స్థాయికి మన రైతులు చేరుకున్నారు. అలాంటి రైతులకు రైతుబందు పెట్టుబడి సహాయం సకారంలో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతోపాటు కోతలు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ యత్నిస్తుందని ఆరోపించారు. ఈనెల 9 తారీఖు వరకు రైతుబందు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రైతు బందు ఎప్పుడు ఇవ్వాలని రైతులు పంట అమ్ముకునే సమయంలో ఇవ్వాలా అని ప్రశ్నించారు.

(రిపోర్టింగ్ కేవీరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

తదుపరి వ్యాసం