తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan Kalyan : మద్య నిషేధమని చెప్పి, లక్ష కోట్లు సంపాదించిన సారా వ్యాపారి- సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

Pawan Kalyan : మద్య నిషేధమని చెప్పి, లక్ష కోట్లు సంపాదించిన సారా వ్యాపారి- సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

17 April 2024, 20:08 IST

    • Pawan Kalyan On CM Jagan : కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ అవినీతి నేతల లెక్కలన్నీ బయటకు తీస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. మద్య నిషేధం అని చెప్పి లక్ష కోట్ల ఆదాయం మద్యం ద్వారా సంపాదించుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.
 సీఎం జగన్ పై పవన్ సెటైర్లు
సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

Pawan Kalyan On CM Jagan : మద్యపానం నిషేధం(Liquor Ban) అని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్... ఇవాళ ఓ సారా వ్యాపారిగా మారి లక్ష కోట్ల ఆదాయం మద్యం ద్వారా సంపాదించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. పెడన ప్రజాగళం(Pedana Prajagalam) సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... 'జగన్ నువ్వు చాలా బాధపడుతున్నావు, నా మీద చాలా కోపంగా ఉన్నావని తెలుసు, నీ బాధ నువ్వు ఓడిపోతున్నావనే తెలుసు' అన్నారు. కూటమి ప్రభుత్వం(NDA Govt) వచ్చాక ఒక్కొక్క వైసీపీ అవినీతి నేతలను, ప్రకృతి వనరులను దోచేసిన ఎమ్మెల్యేలను, ఆడపడుచులను అగౌరవ పరచిన ప్రతీ ఒక్కరికీ బుద్ధి చెప్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక టీచర్లను మద్యం షాపుల దగ్గర కూర్చోపెట్టమని, గురువులను గౌరవిస్తామన్నారు. పోలీసులకు TA, DAలు ఇవ్వటం లేదు, వారంతపు సెలవులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, సకాలంలో జీతాలు ఇవ్వలేదు, పోలీసుల శ్రమ దోచేస్తున్నారని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

KTR : కూటములకు కాలం చెల్లింది, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా- కేటీఆర్

Graduate Mlc Election : ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వంతు, బరిలో 52 మంది

Narayankhed News : ఎన్నికల విధుల్లోని టీచర్ల ఆందోళన, పోలీసుల లాఠీఛార్జ్!

AP TS Polling Percentage : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోలింగ్- ఏపీలో 81 శాతం, తెలంగాణలో 64.74 శాతం!

ఆలోచించి ఓటు వేయండి, అండగా ఉంటాం

"ఉద్దానం తరహా కిడ్నీ వ్యాధులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా కేసులు వస్తున్నాయి. ఆ సమస్యను పరిష్కరించి, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉద్యోగులు, ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదు. సకాలంలో జీతాలు పడాలి, యువతకు ఉపాధి రావాలి, రైతులు సంతోషంగా ఉండాలి. అందుకోసమే కూటమిలోని(NDA Parties) 3 పార్టీలు త్యాగాలు చేసి ముందుకు వచ్చాం. కల్తీ మద్యం అమ్మి, ఆడబిడ్డల పసుపు, కుంకుమ తీసేసి 40 వేల కోట్ల దోచేశారు జగన్(Jagan). ఈ వ్యక్తిని తరిమేయ్యాలి. యువత ఉపాధి లేక, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వారికి అండగా మేము ఉంటాం. ఒక్కసారి నమ్మితే జగన్ ఏం చేశాడో చూశారు, ఈసారి ఆలోచించి ఓటు వేయండి"- పవన్ కల్యాణ్

13 జెట్టీలు నిర్మిస్తాం

ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉండాలనేది జనసేన ఆలోచన, అధికారంలోకి రాగానే 13 జెట్టీలతో మొదలుపెట్టి మత్స్యకారులకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)హామీ ఇచ్చారు. కలంకారీ కార్మికులు తన దృష్టికి రన్నింగ్ వాటర్ సమస్య తీసుకొచ్చారని, చంద్రబాబు సమక్షంలో 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తామని కలంకారీ కార్మికులకు హామీ ఇస్తున్నామన్నారు. ఇవాళ జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ప్రమాణం చేయించానని, రాష్ట్ర భవిష్యత్తు కోసం బలంగా పనిచేసేలా కృషి చేస్తామని మాటిచ్చారన్నారు. మేము రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకుంటామని, మా అభ్యర్థులను గెలిపించండి, జగన్ భయపడేంత బలమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కలంకారీ కార్మికులను ఆదుకుంటాం

ఏపీకి 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. మత్స్యకారులకు అండగా ఉండేలా NDA మేనిఫెస్టోలో నీలి విప్లవం అని మత్స్యకారులకు(Fishermen) జెట్టీల నిర్మాణం, మత్స్య సంపద పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ బలంగా మత్స్యకారులకు అండగా పనిచేస్తామన్నారు. పెడన కలంకారీ కళకు GI మార్క్ గుర్తింపు ఉంది, వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇక్కడ దాదాపు 18 వేల మంది కలంకారీ(Kalamkari) చేనేత కార్మికులు ఉన్నారని, వారికి అండగా ఉంటామన్నారు.

జోగి రమేష్ పై ఫైర్

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్(Jogi Ramesh) పై పవన్ విమర్శలు చేశారు. జోగి రమేష్ దోపిడీపై తాను గతంలోనే చెప్పాన్నారు. పాస్ బుక్ కావాలంటే రూ.10 వేలు, చేపల చెరువుకు రూ.1.5 లక్ష, దాణా షాప్ పెట్టాలంటే రూ.2 లక్షలు, మోటార్ ఆయన చెప్పిన షాప్ లో కొనాలి.. ఇలా అవినీతి చేసే వ్యక్తి అని ఆరోపించారు. మట్టి మాఫీయాపై యువత ఫిర్యాదు చేస్తే వారిని చెట్టుకు కట్టేసి కొట్టారని, ఆఖరికి జడ్జి కుటుంబ ఆస్తులను కూడా దోచేశారని జోగి రమేష్ పై విరుచుకుపడ్డారు. జోగి రమేష్ కు ప్రతీ ఒక్కరూ నమస్కారం పెట్టాలంట, లేకపోతే వారిపై గంజాయి కేసులు పెడతారని ఆరోపణలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే విద్యుత్ కొనుగోలు(Power Pacts) ఒప్పందం రద్దు చేశారన్నారు. గత టీడీపీ(TDP) ప్రభుత్వం యూనిట్ కు రూ.5 ఒప్పందం చేసుకుంటే అది రద్దు చేసి, జగన్ దాదాపు 18 రూపాయలకు కొన్నారన్నారు. దీంతో 5 సార్లు కరెంట్ ఛార్జీలు(Current Charges) పెంచారని, ఇది దోపిడీ కాదా అని ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం