తెలుగు న్యూస్ / ఫోటో /
CM Jagan Satires : రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం, నాలుగేళ్లకొకసారి భార్యలను మారుస్తున్న పవన్-సీఎం జగన్ సెటైర్లు
- CM Jagan Satires : రొయ్యకు మీసం చంద్రబాబు(Chandrababu)కు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ (CM Jagan)ఆరోపించారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పని చెయ్యకపోయినా.. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని ఎల్లో మీడియాలో ప్రచారంతో ఊదరగొడుతున్నారని విమర్శించారు. భీమవరం సభలో సీఎం జగన్ సెటైర్లు వేశారు.

(1 / 6)
రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పని చెయ్యకపోయినా.. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని ఎల్లో మీడియాలో ప్రచారంతో ఊదరగొడుతున్నారని విమర్శించారు.
(2 / 6)
సీఎం జగన్ బస్సు యాత్ర 16వ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari)లో కొనసాగుతోంది. మంగళవారం భీమవరం(Bhimavaram)లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)లపై విమర్శలు చేశారు.
(3 / 6)
మోసాలు, పొత్తులను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. నాపై ఎక్కుపెట్టిన బాణాలన్నీ సంక్షేమ పథకాలకు తగులుతాయన్నారు.
(4 / 6)
చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువని, నాకేదో అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబును ఆ ప్రశ్న అడిగినందుకే నాపై కోపం పెంచుకున్నారన్నారు. ప్రజలను మోసం చేస్తూ ఎందుకు నటిస్తున్నావని చంద్రబాబును అడిగానన్నారు.
(5 / 6)
నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు పవన్ కల్యాణ్ భార్యలను(Pawan Wives) మారుస్తున్నారని సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఇప్పుడు నియోజకవర్గాలను కూడా అలవోకగా మారుస్తున్నారన్నారు. ఇదేం న్యాయమని అడిగితే పవన్ కు ఈ మధ్య బీపీ వచ్చి ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఇతర గ్యాలరీలు