తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ysrcp Candidates : 50 శాతం సీట్లు బలహీన వర్గాలకు, ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం- సీఎం జగన్

Ysrcp Candidates : 50 శాతం సీట్లు బలహీన వర్గాలకు, ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం- సీఎం జగన్

16 March 2024, 17:48 IST

    • Ysrcp Candidates : ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 200 స్థానాల్లో 50 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించామని సీఎం జగన్ తెలిపారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

Ysrcp Candidates : ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా(Ysrcp Mla MP Candidates list) అనంతరం సీఎం జగన్(CM Jagan) మాట్లాడారు. ఇవాళ రిలీజ్‌ చేస్తున్న జాబితాలో మొత్తం 24 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామన్నారు. ఇందులో అనకాపల్లి ఎంపీ స్థానం ఒకటే పెండింగ్‌ లో పెట్టామన్నారు. సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించగలిగామని సీఎం జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం కచ్చితంగా అమలయ్యేలా చట్టం చేశామన్నారు. నామినేషన్‌ పదవుల్లోనూ, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేశామన్నారు. అదే స్ఫూర్తితో 50 శాతం అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలతో మొత్తం 200 స్థానాలకు గానూ 100 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీట్లు కేటాయించామన్నారు. ఏపీలో హిస్టరీలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం ఇదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Fact Check: అసదుద్దీన్ ఒవైసీ రాముడి చిత్రపటాన్ని స్వీకరిస్తున్న ఫొటో నిజమైనదేనా?

SIT Report on AP Violence : ఏపీలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక- పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ నేతల పాత్రపై విచారణ!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు

మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 59 స్థానాలు బీసీలకే(BC) కేటాయించామని సీఎం జగన్ తెలిపారు. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలు బీసీలకే కేటాయించామన్నారు. 200 స్థానాలకు 22 స్థానాలు అంటే 12 శాతం మహిళలకు కేటాయించామన్నారు. గత ఎన్నికల్లో 19 సీట్లు మహిళలకు ఇస్తే ఈసారి 24 దాకా తీసుకెళ్లామన్నారు. వచ్చే ఎన్నికలకు ఇంకా పెద్ద సంఖ్యలో మహిళలకు సీట్లు ఇస్తామన్నారు. ఇవాళ విడుదల చేసిన వైసీపీ(Ysrcp) అభ్యర్థుల జాబితా 200 మందిలో(175 Mla, 25 MP) ఏకంగా 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివినవారన్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది అభ్యర్థులకు 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆ పై చదువులు చదివిన వారిని సీఎం జగన్ తెలిపారు. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇప్పుడు 7 స్థానాలకు పెంచగలిగామన్నారు. మొత్తం మీద 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీట్లు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అన్నారు.

81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు

2024 ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల(Mla) మార్పు, 18 ఎంపీ స్థానాల్లో(MP) మార్పు చేశామని సీఎం జగన్ అన్నారు. దాదాపుగా 99 స్థానాలు అంటే 50 శాతం స్థానాల్లో మార్పులు చేశామన్నారు. మార్పు చేసిన వారికి, టికెట్‌ రాని వారికి రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్లందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కనీ వినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఈ 5 సంవత్సరాల పాలన జరిగిందన్నారు. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి లబ్దిదారులకు అందించామన్నారు. గ్రామ సచివాలయాలు, 50–60 ఇళ్లకు వాలంటీర్‌ వ్యవస్థ(AP Volunteer System) తీసుకుని రావడం, వీటంన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు లేని వ్యవస్థ వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశామన్నారు. మళ్లీ 2–3 నెలల్లో కచ్చితంగా నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ అన్నారు. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుని పోయే అడుగులు వేస్తామన్నారు.

తదుపరి వ్యాసం