తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2024 Schedule: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ ఇదే.. ఆ రెండు నగరాల్లో మ్యాచ్‌లు

WPL 2024 Schedule: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ ఇదే.. ఆ రెండు నగరాల్లో మ్యాచ్‌లు

Hari Prasad S HT Telugu

24 January 2024, 21:56 IST

    • WPL 2024 Schedule: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ ను బీసీసీఐ బుధవారం (జనవరి 24) రిలీజ్ చేసింది. ఈసారి లీగ్ ను బెంగళూరు, ఢిల్లీ ఆతిథ్యమిస్తున్నాయి.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

WPL 2024 Schedule: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024) షెడ్యూల్ రిలీజైంది. గతేడాది ప్రారంభమైన ఈ లీగ్ ఈసారి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకూ జరగనుంది. ఈసారి కూడా ఐదు టీమ్స్ లీగ్ లో పాల్గొంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

ఈ సీజన్ లో ప్రతి రోజూ ఒకే మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. మ్యాచ్ లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. 2024 సీజన్ రెండు నగరాల్లో జరుగుతుందని కూడా బోర్డు తెలిపింది.

డబ్ల్యూపీఎల్ 2024 ఇలా..

పురుషులకు ఐపీఎల్‌లాగే మహిళలకు గతేడాది నుంచి డబ్ల్యూపీఎల్ ను బీసీసీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదు ఫ్రాంఛైజీలతో ఈ లీగ్ 2023లో మొదలైంది. ఈసారి కూడా ఐదు జట్లే ట్రోఫీ కోసం తలపడనున్నాయి. అయితే 2024లో మాత్రం రెండు నగరాలు లీగ్ కు ఆతిథ్యమిస్తున్నాయి. బెంగళూరు, ఢిల్లీల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.

మొదట 11 మ్యాచ్ లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి. ఆ తర్వాత మిగిలిన 9 లీగ్ మ్యాచ్ లతోపాటు రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. గతేడాది ఫైనలిస్టుల మధ్య ఈసారి తొలి మ్యాచ్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ లో భాగంగా మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి.

తొలి మ్యాచ్ ఫైనలిస్టుల మధ్య..

డబ్ల్యూపీఎల్ 2024లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 23న డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ఆ మరుసటి రోజు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తో రెండో మ్యాచ్ లో తలపడుతుంది. మూడో మ్యాచ్ లో మరోసారి ముంబై ఇండియన్స్ టీమ్ గుజరాత్ జెయింట్స్ తో ఆడుతుంది.

ఇక బెంగళూరులో మొదటి 9 మ్యాచ్ లు ముగిసిన తర్వాత మార్చి 5 నుంచి ఢిల్లీ లెగ్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. అక్కడ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. డీసీ టీమ్ తొలిసారి తమ సొంత గడ్డ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడబోతోంది. మార్చి 13న లీగ్ స్టేజ్ ముగుస్తుంది. అప్పటి వరకూ ప్రతి రోజూ ఒక లీగ్ మ్యాచ్ జరుగుతుంది.

లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత టేబుల్లో టాప్ లో ఉన్న టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ లో తలపడతాయి. ఈ మ్యాచ్ మార్చి 15న జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఫైనల్ చేరుతుంది. రెండో సీజన్ డబ్ల్యూపీఎల్ ఫైనల్ మార్చి 17న జరుగుతుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోనే జరుగుతుంది.

ఈసారి డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ షెడ్యూల్ రిలీజైన తర్వాతే లీగ్ షెడ్యూల్ ను బీసీసీఐ అనౌన్స్ చేయనుంది. ఈ ఏడాది ఐపీఎల్ వేదికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు.

తదుపరి వ్యాసం