తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup 2023 Latest Points Table: ఇండియా సెమీఫైనల్ న్యూజిలాండ్‌తోనే.. పాకిస్థాన్‌కు ఇక అసాధ్యమే.. పాయింట్ల టేబుల్ ఇదీ

World Cup 2023 Latest Points Table: ఇండియా సెమీఫైనల్ న్యూజిలాండ్‌తోనే.. పాకిస్థాన్‌కు ఇక అసాధ్యమే.. పాయింట్ల టేబుల్ ఇదీ

Hari Prasad S HT Telugu

09 November 2023, 20:21 IST

    • World Cup 2023 Latest Points Table: ఇండియా సెమీఫైనల్ న్యూజిలాండ్‌తోనే ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలంకను కివీస్ చిత్తుగా ఓడించిన తర్వాత.. ఇక పాకిస్థాన్‌ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా ఉంది.
వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్న న్యూజిలాండ్
వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్న న్యూజిలాండ్ (ANI)

వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్న న్యూజిలాండ్

World Cup 2023 Latest Points Table: వరల్డ్ కప్ 2023లో టీమిండియా సెమీఫైనల్ ప్రత్యర్థి న్యూజిలాండ్ కావడం ఇక లాంఛనమే. గురువారం (నవంబర్ 9) శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో 5 వికెట్లతో గెలిచిన న్యూజిలాండ్.. తన నెట్ రన్‌రేట్ మెరుగుపరచుకుంది. కివీస్ నెట్ రన్ రేట్ ను పాకిస్థాన్ అధిగమించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఎందుకంటే ఒకవేళ న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ ను అతి భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి ఒకవేళ 300 పరుగులు చేస్తే.. తర్వాత ఇంగ్లండ్ ను కేవలం 13 పరుగులకే కట్టడి చేయాలి.

ఒకవేళ పాక్ అదే 300 స్కోరు చేజ్ చేయాల్సి వస్తే కేవలం 6 ఓవర్లలోనే చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఆ లెక్కన టాప్ ప్లేస్ లో ఉన్న ఇండియా, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మధ్య ముంబైలో సెమీఫైనల్ ఖాయం.

వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్ ఇదీ

ఇండియా ఆడిన 8 మ్యాచ్ లలో 8 గెలిచి 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. ఆ టీమ్ 8 మ్యాచ్ లలో 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లు, 1.376 నెట్ రన్ రేట్ తో ఉంది. సౌతాఫ్రికా తన చివరి మ్యాచ్ ను శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్ తో ఆడనుంది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.

ఆఫ్ఘనిస్థాన్ పై మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో అసాధ్యమనుకున్న విజయం సాధించిన ఆస్ట్రేలియా.. 8 మ్యాచ్ లలో 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లు, 0.861 నెట్ రన్ రేట్ తో మూడో ప్లేస్ లో ఉంది. ఆ టీమ్ చివరి లీగ్ మ్యాచ్ ను శనివారం బంగ్లాదేశ్ తో ఆడనుంది. అయితే వరల్డ్ కప్ లో మరో సెమీఫైనల్ మాత్రం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల మధ్యే జరగనుంది. తమ చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా రెండు, మూడు స్థానాల్లో ఉండే ఈ రెండు టీమ్స్ మరో సెమీస్ లో తలపడతాయి.

మెరుగైన న్యూజిలాండ్ నెట్ రన్ రేట్

శ్రీలంకను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్ తమ నెట్ రన్ రేట్ మెరుగుపరచుకుంది. మరో 26.4 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్లతో గెలవడంతో న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ 0.743కి చేరింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 5 విజయాలు, 4 ఓటములతో పది పాయింట్లు సాధించింది.

ఇక తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్థాన్ 8 మ్యాచ్ లలో 4 విజయాలు, 4 ఓటములతో 8 పాయింట్లతో ఉంది. ఇక ఆరు నుంచి 10వ స్థానం వరకూ చూస్తే వరుసగా ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ ఉన్నాయి.

తదుపరి వ్యాసం