Maxwell Records: ఒంటికాలిపై ఆడుతూ మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన రికార్డులు ఇవీ-glenn maxwell records in the match against afghanistan in world cup 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maxwell Records: ఒంటికాలిపై ఆడుతూ మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన రికార్డులు ఇవీ

Maxwell Records: ఒంటికాలిపై ఆడుతూ మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన రికార్డులు ఇవీ

Nov 08, 2023, 01:41 PM IST Hari Prasad S
Nov 08, 2023, 01:41 PM , IST

  • Maxwell Records: ఒంటికాలిపై ఆడుతూ మ్యాక్స్‌వెల్.. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అతని అజేయ డబుల్ సెంచరీ ఆస్ట్రేలియాకు అసాధ్యమనుకున్న విజయం కట్టబెట్టగా.. సచిన్ అంతటి ప్లేయర్ కూడా తాను చూసిన బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ ఇదే అని కొనియాడటం విశేషం.

Maxwell Records: ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలుసు కదా. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అందులో మొట్టమొదటిది వన్డే క్రికెట్ లో చేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా మ్యాక్స్‌వెల్ నిలవడం. గతంలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 193 రన్స్ తో టాప్ లో ఉండగా.. ఇప్పుడా రికార్డును మ్యాక్సీ బ్రేక్ చేశాడు.

(1 / 7)

Maxwell Records: ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలుసు కదా. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అందులో మొట్టమొదటిది వన్డే క్రికెట్ లో చేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా మ్యాక్స్‌వెల్ నిలవడం. గతంలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 193 రన్స్ తో టాప్ లో ఉండగా.. ఇప్పుడా రికార్డును మ్యాక్సీ బ్రేక్ చేశాడు.(AFP)

Maxwell Records: వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో మ్యాక్సీ 201 రన్స్ చేసిన విషయం తెలిసిందే. 2011 వరల్డ్ కప్ లో షేన్ వాట్సన్.. బంగ్లాదేశ్ పై చేసిన 185 రన్స్ టాప్ లో ఉండగా.. మ్యాక్స్‌వెల్ బ్రేక్ చేశాడు.

(2 / 7)

Maxwell Records: వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో మ్యాక్సీ 201 రన్స్ చేసిన విషయం తెలిసిందే. 2011 వరల్డ్ కప్ లో షేన్ వాట్సన్.. బంగ్లాదేశ్ పై చేసిన 185 రన్స్ టాప్ లో ఉండగా.. మ్యాక్స్‌వెల్ బ్రేక్ చేశాడు.(AFP)

Maxwell Records: వన్డేల్లో మూడో స్థానం, అంతకంటే దిగువన వచ్చిన డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. అంతకుముందు చార్లెస్ కోవెంట్రీ 194 రన్స్ చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్ లో టాప్ 4 కాకుండా డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్ మ్యాక్స్‌వెల్ కాకుండా మరొకరు లేరు.

(3 / 7)

Maxwell Records: వన్డేల్లో మూడో స్థానం, అంతకంటే దిగువన వచ్చిన డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. అంతకుముందు చార్లెస్ కోవెంట్రీ 194 రన్స్ చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్ లో టాప్ 4 కాకుండా డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్ మ్యాక్స్‌వెల్ కాకుండా మరొకరు లేరు.(PTI)

Maxwell Records: వరల్డ్ కప్ లలో డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఇంతకుముందు 2015 వరల్డ్ కప్ లో క్రిస్ గేల్ (217), మార్టిన్ గప్టిల్ (237) డబుల్ సెంచరీలు చేశారు.

(4 / 7)

Maxwell Records: వరల్డ్ కప్ లలో డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఇంతకుముందు 2015 వరల్డ్ కప్ లో క్రిస్ గేల్ (217), మార్టిన్ గప్టిల్ (237) డబుల్ సెంచరీలు చేశారు.(PTI)

Maxwell Records: 8వ వికెట్ కు కమిన్స్ తో కలిసి మ్యాక్స్‌వెల్ 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వన్డేల్లో 7వ వికెట్, అంతకంటే దిగువన ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం.

(5 / 7)

Maxwell Records: 8వ వికెట్ కు కమిన్స్ తో కలిసి మ్యాక్స్‌వెల్ 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వన్డేల్లో 7వ వికెట్, అంతకంటే దిగువన ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం.(PTI)

Maxwell Records: వన్డేల్లో వేగంగా డబుల్ సెంచరీ చేసిన వాళ్లలో మ్యాక్స్‌వెల్ స్థానం రెండోది. గ్లెన్ 128 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. అంతకుముందు ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు.

(6 / 7)

Maxwell Records: వన్డేల్లో వేగంగా డబుల్ సెంచరీ చేసిన వాళ్లలో మ్యాక్స్‌వెల్ స్థానం రెండోది. గ్లెన్ 128 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. అంతకుముందు ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు.(AP)

Maxwell Records: ఆరో స్థానం, అంతకంటే దిగువన వచ్చి వరల్డ్ కప్ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. 40 ఏళ్లుగా కపిల్ దేవ్ (175) పేరిట ఉన్న రికార్డును మ్యాక్సీ తిరగరాశాడు.

(7 / 7)

Maxwell Records: ఆరో స్థానం, అంతకంటే దిగువన వచ్చి వరల్డ్ కప్ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. 40 ఏళ్లుగా కపిల్ దేవ్ (175) పేరిట ఉన్న రికార్డును మ్యాక్సీ తిరగరాశాడు.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు