తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2024: ఈవారంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ షురూ.. పూర్తి మ్యాచ్‍ల తేదీలు, జట్లు, టైమ్ లైవ్ వివరాలివే

WPL 2024: ఈవారంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ షురూ.. పూర్తి మ్యాచ్‍ల తేదీలు, జట్లు, టైమ్ లైవ్ వివరాలివే

19 February 2024, 20:36 IST

    • WPL 2024 Details: డబ్ల్యూపీఎల్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో (ఫిబ్రవరి 23) ఈ మహిళల టీ20 టోర్నీ షురూ కానుంది. ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్, మ్యాచ్‍ల టైమ్, లైవ్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
WPL 2024: ఈవారంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ షురూ.. పూర్తి మ్యాచ్‍ల తేదీలు, జట్లు, టైమ్ లైవ్ వివరాలివే
WPL 2024: ఈవారంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ షురూ.. పూర్తి మ్యాచ్‍ల తేదీలు, జట్లు, టైమ్ లైవ్ వివరాలివే

WPL 2024: ఈవారంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ షురూ.. పూర్తి మ్యాచ్‍ల తేదీలు, జట్లు, టైమ్ లైవ్ వివరాలివే

WPL 2024: మహిళల టీ20 టోర్నీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్‍ సమీపిస్తోంది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీ ఫిబ్రవరి 23వ తేదీన మొదలుకానుంది. మార్చి 17వ తేదీన ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 23న తొలి మ్యాచ్ జరగనుంది. డబ్ల్యూపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ వివరాలు ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Deepak Chahar: ఇది రియ‌ల్ లైఫ్ సైంధ‌వ్ మూవీ - హీరోగా నిలిచిన టీమిండియా క్రికెట‌ర్‌ దీప‌క్ చాహ‌ర్‌

DC vs LSG: స్టబ్స్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ దీటైన స్కోరు.. సూపర్ క్యాచ్ పట్టిన రాహుల్.. చప్పట్లతో అభినందించిన ఓనర్

Rohit Sharma: టీ20 ప్రపంచకప్‍కు ముందు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడంపై స్పందించిన సౌరవ్ గంగూలీ

Rohit Sharma vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్

5 జట్లు.. 22 మ్యాచ్‍లు

డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది టోర్నీలో మొత్తంగా 22 మ్యాచ్‍లు జరగనున్నాయి. ఇందులో 20 లీగ్ మ్యాచ్‍లు, ఓ ఎలిమినేటర్, ఫైనల్ ఉంటాయి. పాయింట్ల పట్టికలో ఫస్ట్ ఉండే జట్టు నేరుగా ఫైనల్‍కు చేరుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఎలిమినేటర్‌ గెలిచే జట్టు ఫైనల్ చేరుతుంది.

డబ్ల్యూపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారత సారథి హర్మన్ ప్రీత్ కౌర్, ఢిల్లీకి ఆస్ట్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆసీస్ స్టార్ బెత్ మూనీ, రాయల్ చాలెంజర్స్ జట్టుకు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, యూపీ వారియర్స్ టీమ్‍కు ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హేలీ కెప్టెన్సీ చేయనున్నారు.

WPL 2024 వేదికలు, టైమింగ్స్

డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీ మ్యాచ్‍లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాల్లో జరగనున్నాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‍లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి.

డబ్ల్యూపీఎల్ 2024 లైవ్ వివరాలు

డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీ మ్యాచ్‍లు ‘స్పోర్ట్స్ 18’ నెట్‍వర్క్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. డిజిటల్ విషయానికి వస్తే.. ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‍లు షురూ అవుతాయి. టాస్ రాత్రి 7 గంటలకు ఉంటుంది.

డబ్ల్యూపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్, మ్యాచ్‍ల తేదీలు

  • ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - ఫిబ్రవరి 23 - బెంగళూరులో..
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ - ఫిబ్రవరి 24 - బెంగళూరులో..
  • గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ - ఫిబ్రవరి 25 - బెంగళూరులో..
  • యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - ఫిబ్రవరి 26 - బెంగళూరులో..
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ - ఫిబ్రవరి 27 - బెంగళూరులో..
  • ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్ - ఫిబ్రవరి 28 - బెంగళూరులో..
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ - ఫిబ్రవరి 29 - బెంగళూరులో..
  • యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ - మార్చి 1 - బెంగళూరులో..
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ - మార్చి 2 - బెంగళూరులో..
  • గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - మార్చి 3 - బెంగళూరులో..
  • యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మార్చి 4 - బెంగళూరులో..
  • ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ - మార్చి 5 - ఢిల్లీలో..
  • గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మార్చి 6 - ఢిల్లీలో..
  • యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్ - మార్చి 7 - ఢిల్లీలో..
  • ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ - మార్చి 8 - ఢిల్లీలో..
  • ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ - మార్చి 9 - ఢిల్లీలో..
  • ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మార్చి 10 - ఢిల్లీలో..
  • గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ - మార్చి 11 - ఢిల్లీలో..
  • ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మార్చి 12 - ఢిల్లీలో..
  • ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ - మార్చి 13 - ఢిల్లీలో..
  • ఎలిమినేటర్ - మార్చి 15 - ఢిల్లీలో..
  • ఫైనల్ - మార్చి 17 - ఢిల్లీలో..

తదుపరి వ్యాసం