తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli World Record: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విరాట్ కోహ్లి అరుదైన ఘనత

Virat Kohli World Record: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విరాట్ కోహ్లి అరుదైన ఘనత

Hari Prasad S HT Telugu

29 December 2023, 14:53 IST

    • Virat Kohli World Record: విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ ఇతర క్రికెటర్ కూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (PTI)

విరాట్ కోహ్లి

Virat Kohli World Record: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేయడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఈ కేలండర్ ఏడాదిలో కోహ్లి 2 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇలా ఒకే కేలండర్ ఏడాదిలో 2 వేల పరుగులు చేయడం కోహ్లికి ఇది ఏడోసారి కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

ఇప్పటి వరకూ 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఇతర బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. సౌతాఫ్రికాతో రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి 82 బంతుల్లో 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో 2023లో కోహ్లి మొత్తం పరుగుల సంఖ్య 2006కు చేరింది. ఇంతకుముందు కూడా అతడు ఈ ఫీట్ ను ఆరుసార్లు అందుకున్నాడు.

కోహ్లి గతంలో 2012 (2186 రన్స్), 2016 (2595 రన్స్), 2017 (2818 రన్స్), 2018 (2735 రన్స్), 2019 (2455 రన్స్)లలోనూ ఒకే కేలండర్ ఏడాదిలో 2 వేలకు పైగా రన్స్ చేశాడు. 1877లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి నుంచీ ఏ ఇతర క్రికెటర్ కూడా ఇలా ఏడుసార్లు ఈ ఘనత సాధించలేదు. అయితే ఇంతటి చారిత్రక ఇన్నింగ్స్ చివరికి వృథాగా మారి ఇండియా ఇన్నింగ్స్ ఓటమి పాలైంది.

రెండు టెస్టుల సిరీస్ లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా గడ్డపై ఈసారి కూడా టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. సెంచూరియన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లలో దారుణంగా విఫలమైంది రోహిత్ సేన. తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో కోహ్లి హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో ఇండియా టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. అంతేకాదు స్లో ఓవర్ రేట్ కారణంగా మరో రెండు పాయింట్లు కోత విధించడంతో ఐదు నుంచి ఆరుకు దిగజారింది.

తదుపరి వ్యాసం