తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: వాహ్.. విరాట్ కోహ్లి.. మెస్సీ ఆడిన వరల్డ్ కప్ ఫైనల్ కంటే ఎక్కువ మంది చూశారు

Virat Kohli: వాహ్.. విరాట్ కోహ్లి.. మెస్సీ ఆడిన వరల్డ్ కప్ ఫైనల్ కంటే ఎక్కువ మంది చూశారు

Hari Prasad S HT Telugu

23 October 2023, 15:27 IST

    • Virat Kohli: వాహ్.. విరాట్ కోహ్లి.. మెస్సీ ఆడిన వరల్డ్ కప్ ఫైనల్ కంటే ఎక్కువ మంది న్యూజిలాండ్ పై కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ చూశారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కు రికార్డు వ్యూయర్ షిప్ రావడం విశేషం.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AFP)

విరాట్ కోహ్లి

Virat Kohli: విరాట్ కోహ్లియా మజాకా. ఒకప్పుడు క్రికెట్ లో సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే ప్రపంచమంతా నిలిచిపోయేది అంటుండేవారు. ఇప్పుడు కెరీర్ లోనే టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లి ఆడుతుంటే ప్రపంచం అలాగే ఆగిపోతోంది. వరల్డ్ కప్ 2023లో భాగంగా ధర్మశాలలో న్యూజిలాండ్ పై కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ చూడటానికి టీవీ ముందు అభిమానులు ఎగబడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

గతేడాది అర్జెంటీనా, ఫ్రాన్స్ ఆడిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కంటే కూడా ఎక్కువ మంది కోహ్లి ఆటను చూడటం విశేషం. ఆ వరల్డ్ కప్ ఫైనల్లో మెస్సీ, ఎంబాపెలాంటి స్టార్ సాకర్ ప్లేయర్స్ ఉన్నారు. అలాంటి వాళ్లనూ విరాట్ మించిపోయాడు. కోహ్లి ఆడుతున్న సమయంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఒకేసారి 4.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఏకకాలంలో ఇన్ని వ్యూస్ రావడం ప్రపంచంలోనే తొలిసారి.

ఈ విషయాన్ని హాట్ స్టార్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్ ను జియో సినిమా యాప్ ద్వారా ఇండియాలో 3.2 కోట్ల మంది చూశారు. ఇప్పుడు అంతకంటే కోటి మంది ఎక్కువే కావడం విశేషం. న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లోనూ ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. చేజింగ్ కింగ్ కోహ్లి తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. 95 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇప్పటికే వన్డేల్లో 48 సెంచరీలు చేసిన కోహ్లి.. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి ఉంటే సచిన్ 49 సెంచరీల రికార్డును సమం చేసేవాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కోహ్లి సెంచరీకి రాహుల్ సహకరించినట్లే.. ఈ మ్యాచ్ లోనూ అతని సెంచరీకి జడేజా సహకరించినా.. సెంచరీకి 5 పరుగుల దూరంలో ఉన్నప్పుడు భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు.

వరల్డ్ కప్ లో టాప్ ఫామ్ లో ఉన్న విరాట్.. ప్రస్తుతం 354 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇప్పటికే ఐదు మ్యాచ్ లలో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. అతనితోపాటు కెప్టెన్ రోహిత్ దూకుడైన ఆటతీరు.. సమష్టిగా రాణిస్తున్న బౌలర్లు ఇండియాకు స్వదేశంలో వరల్డ్ కప్ పై ఆశలు రేపుతున్నాయి.

తదుపరి వ్యాసం