FIFA 2022 Best Player: అర్జెంటీనా స్టార్ మెస్సీకి అరుదైన గౌరవం.. బెస్ట్ ప్లేయర్ అవార్డ్-lionel messi wins best fifa men player award ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Lionel Messi Wins Best Fifa Men Player Award

FIFA 2022 Best Player: అర్జెంటీనా స్టార్ మెస్సీకి అరుదైన గౌరవం.. బెస్ట్ ప్లేయర్ అవార్డ్

Maragani Govardhan HT Telugu
Feb 28, 2023 07:58 AM IST

FIFA 2022 Best Player: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఫిఫా 2022 మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును గెల్చుకున్నాడు. పారిస్ వేదికగా సోమవారం నాడు ఈ కార్యక్రమం జరిగింది.

లియోనల్ మెస్సీ
లియోనల్ మెస్సీ (AP)

FIFA 2022 Best Player: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ గతేడాది తన దేశానికి ప్రపంచకప్ అందించండలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అందుకున్న ఈ స్టార్ ఆటగాడు ప్రస్తుతం అరుదైన గౌరవాన్ని పొందాడు. ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ 2022 అవార్డును అందుకున్నాడు. సోమవారం నాడు పారిస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో మెస్సీని ఈ పురస్కారంతో గౌరవించారు. స్పెయిన్‌కు చెందిన అలెక్సియా పుటెల్లాస్ ఫిఫా బెస్ట్ వుమెన్స్ ప్లేయర్ అవార్డును దక్కించుంకుంది.

ట్రెండింగ్ వార్తలు

గత ప్రపంచకప్ ఫైనల్‌లో తన ప్రత్యర్థి ఆటగాడు కిలియన్ ఎంబాపే, బాలోన్ డీ విన్నర్ కరీమ్ బెంజమా లాంటి ఆటగాళ్లను సైతం వెనక్కి నెట్టి మెస్సీ అవార్డను కైవసం చేసుకున్నాడు. ఈ పురస్కారం మెస్సీ దక్కించుకోవడం ఇది రెండో సారి. గతంలో 2016లో ఫిఫా పురస్కారాన్ని పొందాడు.

నేషన్ టీమ్ కోచ్‌లు, కెప్టెన్‌లు, జర్నలిస్టులు, అభిమానుల ఓటింగ్ ద్వారా ఈ అవార్డుకు మెస్సీని ఎంపిక చేశారు. అర్జెంటినా జట్టును ప్రపంచకప్ విజయపథంలో నడిపించిన ఈ బార్సిలోనా స్టార్ అద్భుత ప్రయణానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందించారు. తన అద్భుతమైన కెరీర్‌కు పట్టం గట్టిన సంవత్సరాన్ని ఈ గౌరవం సూచిస్తుంది. గతేడాది దోహా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో మెస్సీ 2 సార్లు అద్భుత గోల్స్ చేశాడు. 3-3 డ్రాగా నిలిచిన మ్యాచ్‌ను ఫెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది.

ఏడు సార్లు బాలోన్ డీ ఆర్ విన్నర్‌గా నిలిచిన 35 ఏళ్ల మెస్సీ.. రాబర్ట్ లెవాండోస్కీ తర్వాత ఫిఫా గౌరవ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో అలెక్సియా పుటెల్లాస్ ఈ పురస్కారాన్ని అందుకుంది. గతేడాది జులైలో గాయపడిన ఈమె సగం మ్యాచ్‌లే ఆడినప్పటికీ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం.

అవార్డులు దక్కించుకున్నవారి వివరాలు..

అర్జెంటీనా- ఫిఫా ఫ్యాన్ అవార్డ్ 2022

లూకా లోచోషివిల్లీ- ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డ్

లియోనెల్ స్కాలోని- ఫిఫా మెన్స్ కోచ్ 2022

సరీనా వీమ్- ఫిఫా వుమెన్స్ కోచ్ 2022

మార్సిన్ ఒలెస్కీ- ది ఫిఫా పుస్కాస్ అవార్డ్(బెస్ట్ గోల్)

ఎమిలియానో మార్టినేజ్- ఫిఫా మెన్స్ గోల్ కీపర్ అవార్డ్ 2022

మేరీ ఎర్ప్స్- ఫిఫా వుమెన్స్ గోల్ కీపర్ 2022.

WhatsApp channel

సంబంధిత కథనం