తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్న రాహుల్ ద్రవిడ్.. ఇతర స్టాఫ్ కూడా..

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్న రాహుల్ ద్రవిడ్.. ఇతర స్టాఫ్ కూడా..

Hari Prasad S HT Telugu

29 November 2023, 14:02 IST

    • Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతనితోపాటు ఇతర సహాయ సిబ్బంది కాంట్రాక్టులను పొడిగిస్తూ బుధవారం (నవంబర్ 29) బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగనున్న రాహుల్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగనున్న రాహుల్ ద్రవిడ్ (AFP)

టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగనున్న రాహుల్ ద్రవిడ్

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఇన్నాళ్లూ ఆ పదవిలో కొనసాగిన రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టును బీసీసీఐ పొడిగింది. ద్రవిడ్ తోపాటు ఇతర సహాయ సిబ్బంది కూడా తమ పదవుల్లో కొనసాగనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ తో ద్రవిడ్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత అతనితో చర్చలు జరిపి దీనిని పొడిగించాలని నిర్ణయించినట్లు బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

ఈ రెండేళ్ల కాలంలో టీమిండియా రాటుదేలడంలో రాహుల్ ద్రవిడ్ సేవలను బీసీసీఐ గుర్తించినట్లు బోర్డు ఆ ప్రకటనలో తెలిపింది. ద్రవిడ్ తోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా కొనసాగనున్నారు. అయితే ద్రవిడ్ ఎన్నాళ్లు ఆ పదవిలో కొనసాగనున్నాడన్నది మాత్రం బోర్డు వెల్లడించలేదు. ఇది కనీసం వచ్చే ఏడాది జూన్, జులైలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ వరకైనా ఉంటుందని భావిస్తున్నారు.

నవంబర్, 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాడు. రెండేళ్లపాటు అతనితో బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. అది ఈ మధ్యే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ముగిసింది. తర్వాత కూడా ద్రవిడే కోచ్ గా కొనసాగాలని కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ లతోపాటు బీసీసీఐ కూడా భావించినా.. మొదట్లో అతడు దానికి అంగీకరించలేదు.

అయితే చివరికి ద్రవిడ్ ను బోర్డు ఒప్పించి కోచ్ గా కొనసాగేలా చేసింది. ఇక సౌతాఫ్రికా టూర్ కు వెళ్లే టీమిండియాతో హెడ్ కోచ్ గా ద్రవిడే వెళ్తాడు. డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా టూర్ కు ఇండియన్ టీమ్ వెళ్లనుంది. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. డిసెంబర్ 10న టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

వచ్చే ఏడాది జనవరి 7తో సౌతాఫ్రికా టూర్ ముగుస్తుంది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది టీమిండియా. తర్వాత ఐపీఎల్, ఆ తర్వాత జూన్, జులైలలో టీ20 వరల్డ్ కప్ ఉంటుంది.

తదుపరి వ్యాసం