తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa: భారత్‌తో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. మ్యాచ్‌కు ముందే ఊహించని షాక్!

IND vs SA: భారత్‌తో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. మ్యాచ్‌కు ముందే ఊహించని షాక్!

Sanjiv Kumar HT Telugu

09 December 2023, 11:37 IST

  • India vs South Africa T20 Series 2023-24: భారత్‌ - దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‍కు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌కు ముందే సౌతాఫ్రికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారత్‌తో సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్.. మ్యాచ్‌కు ముందే ఊహించని షాక్!
భారత్‌తో సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్.. మ్యాచ్‌కు ముందే ఊహించని షాక్!

భారత్‌తో సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్.. మ్యాచ్‌కు ముందే ఊహించని షాక్!

India vs South Africa T20 Series Updates: ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనను మొదలుపెట్టనుంది. టీమిండియా - సౌతాఫ్రికా మధ్య ముందుగా మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. ఆదివారం (డిసెంబర్ 10) నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది. టీ20 తర్వాత మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‍లు ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

ఇప్పటికే దక్షిణాఫ్రికాకు భారత టీ20 జట్టు చేరుకుంది. ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్ కోసం సౌతాఫ్రికా సన్నద్ధం అయింది. ఈ తరుణంలో దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో లుంగి ఎంగిడి ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో అతను సిరీస్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టీ20 జట్టు నుంచి సౌతాఫ్రికా క్రికెట్ మెనేజ్‌మెంట్ ఎంగిడిని రిలీజ్ చేసింది. ఇండియాతో టీట20 సిరీస్‌లో ఎంగిడి స్థానంలో పేసర్ బ్యూరాన్ హెండ్రిక్స్‌ను భర్తీ చేశారు సెలెక్టర్లు. 2014లో ప్రోటీస్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన బ్యూరాన్ హెండ్రిక్స్ ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్స్ తీశాడు.

టీ20 సిరీస్‌లో భారత్ జట్టు:

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, దీపక్ చాహర్.

దక్షిణాఫ్రికా జట్టు:

ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఓట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోట్జీ, డొనోవాన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, హెండ్రిక్స్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.

తదుపరి వ్యాసం