తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sl Vs Afg: అఫ్గానిస్థాన్ మళ్లీ అదుర్స్.. లంకపై సూపర్ విక్టరీ.. మూడో గెలుపు

SL vs AFG: అఫ్గానిస్థాన్ మళ్లీ అదుర్స్.. లంకపై సూపర్ విక్టరీ.. మూడో గెలుపు

30 October 2023, 22:07 IST

    • SL vs AFG ICC World Cup 2023 Match 30: అఫ్గానిస్థాన్ జట్టు మరోసారి సత్తాచాటింది. శ్రీలంకపై ఆ జట్టు విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ 2023లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.
SL vs AFG: అఫ్గానిస్థాన్ అదుర్స్.. లంకపై సూపర్ విక్టరీ.. మూడో గెలుపు
SL vs AFG: అఫ్గానిస్థాన్ అదుర్స్.. లంకపై సూపర్ విక్టరీ.. మూడో గెలుపు (Nitin Lawate)

SL vs AFG: అఫ్గానిస్థాన్ అదుర్స్.. లంకపై సూపర్ విక్టరీ.. మూడో గెలుపు

SL vs AFG ICC World Cup 2023 Match 30: ఎక్కువ అంచనాలు లేకుండా వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలోకి అడుగుపెట్టిన అఫ్గానిస్థాన్ జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఇంగ్లండ్, పాకిస్థాన్‍పై సంచలన విజయాలు సాధించిన అఫ్గాన్.. నేడు (అక్టోబర్ 30) శ్రీలంకపై గెలిచింది. దీంతో ఈ వరల్డ్ కప్‍లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచకప్‍లో భాగంగా లక్నోలో నేడు జరిగిన మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

242 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 45.2 ఓవర్లలోనే ఛేదించింది. బ్యాటర్లు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (73 నాటౌట్), రహ్మత్ షా (62), హష్మతుల్లా షాహిది (58 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టి అఫ్గాన్‍ను గెలిపించారు. శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 45.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగులు చేసి అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో ధనుష్ మధుశంక రెండు, కసున్ రజిత ఓ వికెట్ తీయగలిగారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిస్సంక (46), కుషాల్ మెండిస్ (39) రాణించారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారుకీ నాలుగు వికెట్లతో లంక బ్యాటింగ్‍ను కూల్చాడు. ముజీబుర్ రహ్మన్‍కు రెండు, అజ్మతుల్లా, రషీద్ ఖాన్‍కు చెరో వికెట్ దక్కింది.

లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ అదరగొట్టింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0) తొలి ఓవర్లోనే ఔటైనా ఆ తర్వాత అఫ్గాన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఇబ్రహీమ్ జర్దాన్ (39) కాసేపు రాణించాడు. ఆ తర్వాత రహ్మత్ షా అర్ధ శకతంతో మెరిశాడు. 74 బంతుల్లో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్, కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అజేయ హాఫ్ సెంచరీలతో సూపర్‌గా ఆడారు. వికెట్లు పడకుండా జాగ్రత్త పడుతూనే క్రమంగా పరుగులు రాబట్టారు. శ్రీలంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. చివరి వరకు నిలిచిన ఒమర్‌జాయ్ 63 బంతుల్లో 73 పరుగులు, షాహిది 74 బంతుల్లో 58 పరుగులు చేసి.. అఫ్గాన్‍ను గెలుపు తీరాన్ని దాటించారు. లక్ష్యాన్ని ఓ ప్లానింగ్‍తో ఛేదించింది అఫ్గానిస్థాన్. ఇక తమ జట్టు పసికూన కాదని మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటింగ్‍లో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయింది. పాతుమ్ నిస్సంక (46) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగిలిన బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు. కుషాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమ్ (36) పర్వాలేదనిపించారు. లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. అఫ్గానిస్థాన్ పేసర్ ఫజల్‍హక్ ఫారూకీ (4/34) కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ లంకను దెబ్బతీశాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ వన్డే ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‍లు ఆడిన అఫ్గానిస్థాన్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు దక్కించుకుంది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక కంటే పాయింట్ల పట్టికలో పైన ఉంది అఫ్గానిస్థాన్. ఈ టోర్నీ గ్రూప్ స్టేజీలో మరో మూడు మ్యాచ్‍లను అఫ్గాన్ ఆడాల్సి ఉంది. ఆ మూడు గెలిస్తే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు మెండుగా ఉంటాయి.

తదుపరి వ్యాసం