తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shakib On Mathews Timed Out: మాథ్యూస్ ఔటే తమను గెలిపించిందన్న షకీబ్.. సిగ్గు చేటన్న మాథ్యూస్.. లంక, బంగ్లా మాటల యుద్ధం

Shakib on Mathews timed out: మాథ్యూస్ ఔటే తమను గెలిపించిందన్న షకీబ్.. సిగ్గు చేటన్న మాథ్యూస్.. లంక, బంగ్లా మాటల యుద్ధం

Hari Prasad S HT Telugu

07 November 2023, 7:55 IST

  • Shakib on Mathews timed out: మాథ్యూస్ ఔటే తమను గెలిపించిందని అన్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్. ఇది నిజంగా సిగ్గు చేటంటూ గట్టిగా రిప్లై ఇచ్చాడు లంక ప్లేయర్ మాథ్యూస్.

షకీబ్, మాథ్యూస్ మధ్య మాటల యుద్ధం
షకీబ్, మాథ్యూస్ మధ్య మాటల యుద్ధం (ANI-Sky Sports screengrab )

షకీబ్, మాథ్యూస్ మధ్య మాటల యుద్ధం

Shakib on Mathews timed out: వరల్డ్ కప్ 2023లో శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లో జరిగిన మాథ్యూస్ టైమ్డ్ ఔట్ (Mathews timed out) వివాదం ముదురుతోంది. ఈ ఘటనపై బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్, మాథ్యూస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాను యుద్ధంలో ఉన్నానని, ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసినట్లు మ్యాచ్ తర్వాత షకీబ్ చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024: కీలక సమయంలో ఐపీఎల్ జట్లకు ఇంగ్లండ్ ప్లేయర్ల షాక్.. వెళ్లిపోతున్న ఈ ఆటగాళ్లు.. రాజస్థాన్‍కు బైబై చెప్పిన బట్లర్

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

RCB Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

ఇది నిజంగా సిగ్గు చేటని ప్రెస్ మీట్ లో మాథ్యూస్ అన్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. సమరవిక్రమ ఔటైన తర్వాత మాథ్యూస్ విరిగిపోయిన హెల్మెట్ తో క్రీజులోకి వచ్చాడు. తొలి బంతి ఎదుర్కొనే ముందే ఆ హెల్మెట్ మార్చుకోవడానికి ప్రయత్నించడంతో తొలి బంతి ఎదుర్కోవడానికి ఆలస్యమైంది. దీంతో బంగ్లా కెప్టెన్ షకీబ్.. అంపైర్లకు ఫిర్యాదు చేయడం, వాళ్లు టైమ్డ్ ఔట్ గా ప్రకటించడం జరిగిపోయాయి.

నేను యుద్ధంలో ఉన్నట్లు భావించాను: షకీబ్

ఈ ఘటనపై మ్యాచ్ తర్వాత షకీబ్ స్పందించాడు. "నేను యుద్ధంలో ఉన్నట్లు భావించాను. నేను చేయాల్సిందల్లా చేశాను. దీనిపై ఎన్నో చర్చలు జరుగుతాయి. మా విజయానికి అది (టైమ్డ్ ఔట్) సాయం చేసింది. అందులో దాచడానికేమీ లేదు" అని షకీబ్ అన్నాడు.

"మా ఫీల్డర్లలో ఒకరు వచ్చి నేను అప్పీల్ చేస్తే అతడు ఔటవుతాడని చెప్పాడు. నేను సీరియస్ గా అడుగుతున్నానా అని అంపైర్ అడిగాడు. ఇది నిబంధనల్లో ఉంది. అది తప్పా ఒప్పా నాకు తెలియదు" అని షకీబ్ స్పష్టం చేశాడు.

అయితే దీనిపై మాథ్యూస్ సీరియస్ గా స్పందించాడు. మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్ లో అతడు మాట్లాడాడు. ఇది నిజంగా సిగ్గు చేటని అన్నాడు. తాను 2 నిమిషాల్లోపే క్రీజులోకి వచ్చానని, హెల్మెట్ మార్చుకునే సమయానికి కూడా ఇంకా ఐదు సెకన్ల టైమ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు.

"షకీబ్, బంగ్లాదేశ్ టీమ్ కు ఇది సిగ్గు చేటు. క్రికెట్ ఇలా ఆడాలనుకోవడం, ఇంతలా దిగజారడం చూస్తుంటే ఏదో తప్పు జరిగిందనిపిస్తోంది. నేను క్రీజులోకి 2 నిమిషాల్లోపే వచ్చాను. హెల్మెట్ విరగడం చూసిన సమయంలోనూ ఇంకా ఐదు సెకన్ల టైమ్ ఉంది. ఇక్కడ కామన్‌సెన్స్ తో ఆలోచించాలి. నేను మన్కడింగ్ లేదంటే ఫీల్డింగ్ కు అడ్డంకి క్రియేట్ చేయడం చేయలేదు. కామన్‌సెన్స్ తో ఆలోచిస్తే సరిపోయేది. ఇది నిజంగా సిగ్గుచేటు" అని మాథ్యూస్ అన్నాడు.

షకీబ్ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం కూడా నివ్వెరపోయింది. గంభీర్ లాంటి మాజీ క్రికెటర్లు ఎందరో అతని నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా టైమ్డ్ ఔట్ అయిన తొలి క్రికెటర్ గా మాథ్యూస్ నిలిచాడు.

తదుపరి వ్యాసం