తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sa Vs Ban World Cup: భారీ శతకంతో చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్

SA vs BAN World Cup: భారీ శతకంతో చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్

24 October 2023, 18:13 IST

    • SA vs BAN World Cup 2023 - Quinton de Kock: దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ మరోసారి అదరగొట్టాడు. సూపర్ బ్యాటింగ్‍తో చరిత్ర సృష్టించాడు. దీంతో సఫారీ జట్టు భారీ స్కోరు చేసింది.
SA vs BAN World Cup: భారీ శతకంతో చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్
SA vs BAN World Cup: భారీ శతకంతో చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్ (AP)

SA vs BAN World Cup: భారీ శతకంతో చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్

SA vs BAN World Cup 2023 - Quinton de Kock: దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో డికాక్ (140 బంతుల్లో 174 పరుగులు; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా ముంబై వేదికగా బంగ్లాతో నేడు (అక్టోబర్ 24) జరిగిన మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోరు చేసింది. క్వింటన్ డికాక్ భారీ శకతం చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ (49 బంతుల్లో 90 పరుగులు) మెరుపు బ్యాటింగ్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్‍లో శతకం బాది ఓ చరిత్ర సృష్టించాడు డికాక్.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024: కీలక సమయంలో ఐపీఎల్ జట్లకు ఇంగ్లండ్ ప్లేయర్ల షాక్.. వెళ్లిపోతున్న ఈ ఆటగాళ్లు.. రాజస్థాన్‍కు బైబై చెప్పిన బట్లర్

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

RCB Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

చరిత్ర సృష్టించిన డికాక్

ఈ భారీ శతకంతో క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్టార్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‍క్రిస్ట్ (149 పరుగులు - 2007 ప్రపంచకప్)ను డికాక్ అధిగమించాడు.

తొలి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా..

ఒకే వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో మూడు సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‍గా క్వింటన్ డికాక్ రికార్డు సృష్టించాడు. అలాగే, అంతర్జాతీయంగా ఒకే ఎడిషన్‍లో మూడు శతకాలు బాదిన ఏడో బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్‍ నుంచి రిటైర్ అవుతానని క్వింటన్ డికాక్ ప్రకటించాడు. అయితే, తన ఆఖరి వరల్డ్ కప్‍లో అతడు అదరగొడుతున్నాడు.

దక్షిణాఫ్రికా భారీ స్కోరు

బంగ్లాదేశ్‍తో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఆరంభం నుంచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన క్వింటన్ డికాక్ 101 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇక ఆ తర్వాత హిట్టింగ్ గేర్ మార్చాడు. ధనాధన్ ఆట ఆడాడు. 129 బంతుల్లోనే 150 పరుగులకు చేరాడు. అయితే, 46వ ఓవర్లో బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ అతడిని ఔట్ చేశాడు. ఓ దశలో డబుల్ సెంచరీ చేస్తాడని ఆశించిన డికాక్.. 174 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ కూడా మరోసారి తన మార్క్ హిట్టింగ్ చేసి బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 49 బంతుల్లో 90 రన్స్ చేశాడు. మొత్తంగా సఫారీ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ రెండు, షకీబ్, షరీఫుల్, మిరాజా చెరో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ ముందు 283 పరుగుల భారీ టార్గెట్ ఉంది.

తదుపరి వ్యాసం