తెలుగు న్యూస్  /  క్రికెట్  /  New Zealand Vs Sri Lanka: శ్రీలంకను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్.. సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ ఔట్!

New Zealand vs Sri Lanka: శ్రీలంకను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్.. సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ ఔట్!

Hari Prasad S HT Telugu

09 November 2023, 19:52 IST

    • New Zealand vs Sri Lanka: శ్రీలంకను చిత్తుగా ఓడించింది న్యూజిలాండ్. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో ఘన విజయం సాధించడంతో పాకిస్థాన్ టీమ్ సెమీఫైనల్ రేసు నుంచి దాదాపు ఔటైనట్లే.
సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్న న్యూజిలాండ్
సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్న న్యూజిలాండ్ (PTI)

సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్న న్యూజిలాండ్

New Zealand vs Sri Lanka: వరల్డ్ కప్ 2023లో డూ ఆర్ డై మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. 172 రన్స్ టార్గెట్ ను కేవలం 23.2 ఓవర్లలోనే చేజ్ చేసి 5 వికెట్లతో ఓడించింది. ఈ ఘన విజయంతో కివీస్ టీమ్ సెమీఫైనల్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకోగా.. పాకిస్థాన్ టీమ్ ఆశలు గల్లంతైనట్లుగానే భావించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో పాకిస్థాన్ ఒకవేళ 300 స్కోరు చేస్తే.. ఇంగ్లండ్ ను కేవలం 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఒకవేళ చేజింగ్ చేయాల్సి వస్తే ఇంగ్లండ్ ను కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేసి.. ఆ టార్గెట్ ను 2.5 ఓవర్లలోనే చేజ్ చేయాలి. ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

శ్రీలంకపై మ్యాచ్ ను సాధ్యమైనంత త్వరగా ముగించాలని చూసిన న్యూజిలాండ్.. చేజింగ్ లో దూకుడుగా ఆడింది. వరుసగా వికెట్లు పడుతున్నా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓపెనర్లు కాన్వే (45), రచిన్ రవీంద్ర (42) ఇచ్చిన మంచి స్టార్ట్ తో అదే దూకుడును కొనసాగించి.. 23.2 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసింది. డారిల్ మిచెల్ 43 రన్స్ చేశాడు.

చేతులెత్తేసిన లంక బ్యాటర్లు

అంతకుముందు న్యూజిలాండ్ బౌలింగ్ లో రాణించింది. శ్రీలంకను 171 పరుగులకే కట్టడి చేసింది. శ్రీలంక టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేసినా.. టెయిలెండర్లు వీరోచితంగా పోరాడటంతో ఆ టీమ్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఓపెనర్ కుశల్ పెరీరా 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. చివర్లో తీక్షణ 38 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

ఒక దశలో శ్రీలంక టీమ్ 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో తీక్షణ, చమీర, మదుషంక న్యూజిలాండ్ బౌలర్లను ప్రతిఘటించారు. ఈ ముగ్గురూ మరో 23 ఓవర్ల పాటు న్యూజిలాండ్ బౌలర్లను విసిగించారు. ముఖ్యంగా తీక్షణ, మదుషంక చివరి వికెట్ కు ఏకంగా 43 పరుగులు జోడించడం విశేషం. లంక టీమ్ లో నిస్సంక (2), మెండిల్ (6), సమరవిక్రమ (1), అసలంక (8), మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19) విఫలమయ్యారు.

చివర్లో తీక్షణ (38 నాటౌట్), మదుషంక (19) ఒక్కో పరుగూ జోడిస్తూ లంకకు ఓ మోస్తరు స్కోరు అందించగలిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఫెర్గూసన్, సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ కు అనుకూలించే బెంగళూరు పిచ్ పై శ్రీలంక భారీ స్కోరు చేయలేకపోయింది.

తదుపరి వ్యాసం