తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul Hundred: రాహుల్ సూపర్ సెంచరీ.. ఇండియా 245 ఆలౌట్

KL Rahul Hundred: రాహుల్ సూపర్ సెంచరీ.. ఇండియా 245 ఆలౌట్

Hari Prasad S HT Telugu

27 December 2023, 14:52 IST

    • KL Rahul Hundred: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఫైటింగ్ సెంచరీ చేయడంతో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు మరో 37 పరుగులు జోడించి 2 వికెట్లు కోల్పోయింది.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (REUTERS)

కేఎల్ రాహుల్

KL Rahul Hundred: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ వీరోచిత సెంచరీ చేశాడు. రెండో రోజు ఉదయం 70 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్.. చివరికి 137 బంతుల్లో 101 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. తొలి రోజు 191 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన టీమ్ ను రాహుల్ తన ఫైటింగ్ సెంచరీతో ఆదుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

బౌన్సీ పిచ్ పై సౌతాఫ్రికా పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రాహుల్ చేసిన ఈ సెంచరీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అతని సెంచరీతో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. కోహ్లి 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు.

టెయిలెండర్లతో కలిసి రాహుల్ ఒక్కో పరుగూ జోడిస్తూ.. టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 164 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయిన తర్వాత బుమ్రా, సిరాజ్ లతో కలిసి రాహుల్ స్కోరును 245 పరుగుల వరకూ తీసుకెళ్లడం నిజంగా అభినందనీయమే. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా 5, బర్గర్ 3, మార్కో యాన్సెన్, కొయెట్జీ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

48వ టెస్ట్ ఆడుతున్న రాహుల్ కు ఇది 8వ సెంచరీ. అతడు వన్డేల్లో 7, టీ20ల్లో రెండు సెంచరీలు చేశాడు. అయితే సౌతాఫ్రికా గడ్డపై బౌన్స్ కు అనుకూలించే పిచ్ పై ఆ టీమ్ పేస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ చేసిన ఈ సెంచరీ మాత్రం చాలా ప్రత్యేకం.

తదుపరి వ్యాసం