తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Keshav Maharaj: జై శ్రీరామ్ అంటున్న సౌతాఫ్రికా క్రికెటర్.. భారతీయులకు శుభాకాంక్షలు

Keshav Maharaj: జై శ్రీరామ్ అంటున్న సౌతాఫ్రికా క్రికెటర్.. భారతీయులకు శుభాకాంక్షలు

Hari Prasad S HT Telugu

22 January 2024, 10:57 IST

    • Keshav Maharaj: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ జై శ్రీరామ్ అంటున్నాడు సౌతాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్. ఇండియన్స్ అందరికీ అతడు శుభాకాంక్షలు తెలిపాడు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ శుభాకాంక్షలు చెప్పిన కేశవ్ మహరాజ్
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ శుభాకాంక్షలు చెప్పిన కేశవ్ మహరాజ్

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ శుభాకాంక్షలు చెప్పిన కేశవ్ మహరాజ్

Keshav Maharaj: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో కోట్లాది మంది భారతీయులే కాదు.. ఓ సౌతాఫ్రికా క్రికెటర్ కూడా పులకించిపోతున్నాడు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నాడు. అతని పేరు కేశవ్ మహరాజ్. భారత సంతతికి చెందిన ఈ క్రికెటర్ చాలా రోజులుగా సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ తరఫున ఆడుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ఇప్పుడు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేశవ్ మహరాజ్.. భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ఆదివారం (జనవరి 21) సోషల్ మీడియాలో అతడు ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అతడు సౌతాఫ్రికాలో నివసిస్తున్న భారతీయులతోపాటు అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

జై శ్రీరామ్ అంటున్న కేశవ్

శ్రీరాముడి భక్తుడైన కేశవ్ మహరాజ్.. రామ మందిర ప్రారంభోత్సవ వేళ భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు. ఒక రోజు ముందు ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. "నమస్తే. సౌతాఫ్రికాలో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. రేపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇది అందరికీ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జైశ్రీరామ్" అని కేశవ్ ఆ వీడియోలో అన్నాడు.

నిజానికి ఈ నెల మొదట్లో రాముడిపై తనకున్న భక్తిని అతడు చాటుకున్నాడు. ఇండియాతో జరిగిన రెండో టెస్టులో తాను బ్యాటింగ్ కు వస్తున్న సమయంలో రామ్ సీతా రామ్ పాట ప్లే చేయాలని అతడు అక్కడి సిబ్బందిని కోరాడు. కేశవ్ మహరాజ్ బ్యాటింగ్ కు వస్తున్న సమయంలో ఈ పాట రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి కూడా ఆ రాముడికి నమస్కరిస్తున్నట్లుగా, చేతితో బాణం విసురుతున్నట్లుగా సంజ్ఞలు చేస్తూ కనిపించాడు. అయితే తానే ఆ పాటను ప్లే చేయాల్సిందిగా కోరినట్లు ఈ మధ్యే కేశవ్ మహరాజ్ వెల్లడించాడు. మరోవైపు అయోధ్య ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ కూడా ఉన్నారు.

కోహ్లితోపాటు ధోనీ, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్, రవిచంద్రన్ అశ్విన్, మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ లాంటి వాళ్లకు ఈ ఆహ్వానాలు దక్కాయి. అయితే ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కోహ్లి, అశ్విన్ ఈ వేడుకకు హాజరు కావడం లేదు. కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ మాత్రం ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.

అయోధ్య రామ మందిరం గురించి..

అయోధ్య రామ మందిరాన్ని ఏకంగా రూ.1800 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇందులో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. మూడంస్తులుగా ఈ ఆలయం నిర్మితమైంది. 2020లో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. 1949 నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం సాగుతున్న పోరాటం మొత్తానికి ఫలించి.. తాను జన్మించిన చోటే రాముడు కొలువుదీరనున్నాడు.

తదుపరి వ్యాసం