తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gt Vs Pbks: శశాంక్ సింగ్, అశుతోష్ కళ్లు చెదిరే హిట్టింగ్.. గుజరాత్ టైటన్స్‌కు పంజాబ్ కింగ్స్ షాక్

GT vs PBKS: శశాంక్ సింగ్, అశుతోష్ కళ్లు చెదిరే హిట్టింగ్.. గుజరాత్ టైటన్స్‌కు పంజాబ్ కింగ్స్ షాక్

Hari Prasad S HT Telugu

04 April 2024, 23:23 IST

    • GT vs PBKS: గుజరాత్ టైటన్స్ కు వాళ్ల సొంతగడ్డపై దిమ్మదిరిగే షాకిచ్చింది పంజాబ్ కింగ్స్. ఇప్పటి వరకూ పెద్దగా పేరు తెలియని ప్లేయర్స్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ అసాధ్యమనుకున్న విజయాన్ని పంజాబ్ కింగ్స్ కు సాధించి పెట్టారు.
శశాంక్ సింగ్, అశుతోష్ కళ్లు చెదిరే హిట్టింగ్.. గుజరాత్ టైటన్స్‌కు పంజాబ్ కింగ్స్ షాక్
శశాంక్ సింగ్, అశుతోష్ కళ్లు చెదిరే హిట్టింగ్.. గుజరాత్ టైటన్స్‌కు పంజాబ్ కింగ్స్ షాక్

శశాంక్ సింగ్, అశుతోష్ కళ్లు చెదిరే హిట్టింగ్.. గుజరాత్ టైటన్స్‌కు పంజాబ్ కింగ్స్ షాక్

GT vs PBKS: ఐపీఎల్ 2024లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేజ్ చేసింది. అయితే ఆ టీమ్ లోని స్టార్ బ్యాటర్లందరూ చేతులెత్తేయగా.. యువ క్రికెటర్లు శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31) మూడు వికెట్లతో ఊహకందని విజయాన్ని సాధించి పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

శశాంక్ సింగ్ అద్భుతం

200 రన్స్ టార్గెట్ చేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పుడు ఆ టీమ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ శశాంక్ సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన పోరాటాన్ని కొనసాగించాడు. భారీ షాట్లతో గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ కూడా అతనికి చక్కని సహకారం అందించాడు.

చివరి ఓవర్లో అశుతోష్ ఔటైనా.. నాలుగో బంతికి బౌండరీ బాది శశాంక్ సింగ్ పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు. మరో బంతి మిగిలి ఉండగా.. 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేజ్ చేసింది. శశాంక్ సింగ్ 29 బంతుల్లోనే 61 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. ఇక అశుతోష్ 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ (1), బెయిర్ స్టో (22),సామ్ కరన్ (5), సికందర్ రజా (15) ఫెయిలయ్యారు.

గిల్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్

అంతకుముందు శుభ్‌మన్ గిల్ ఓపెనర్ గా వచ్చి చివరి బంతి వరకూ క్రీజులో ఉన్నాడు. చివరికి గిల్ 48 బంతుల్లో 89 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. అయితే ఈ ఇన్నింగ్స్ లో గిల్ ఆడిన ప్రతి షాట్ కళ్లు చెదిరేలా ఉంది. ఓవైపు ఒక్కో బ్యాటర్ క్రీజులోకి వచ్చి వెళ్తుంటే.. గిల్ మాత్రం ఇన్నింగ్స్ మొత్తం భారాన్ని తన భుజాలపై వేసుకొని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

చివర్లో తెవాతియా కేవలం 8 బంతుల్లో 23 రన్స్ చేయడంతో గుజరాత్ టైటన్స్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 రన్స్ చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హర్షల్ పటేల్, కగిసో రబాడా తమ 4 ఓవర్ల కోటాలో చెరో 44 రన్స్ ఇవ్వడం విశేషం. అటు హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 33 పరుగులు ఇచ్చారు.

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటన్స్ తరఫున వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టీమ్ కు ఈ ఇద్దరూ మెరుపు ఆరంభమే ఇచ్చినా.. స్కోరు 29 పరుగుల దగ్గర సాహా (11) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. గతేడాది ఐపీఎల్లో మొదట్లోనే గాయపడి లీగ్ మొత్తానికి దూరమైన కేన్.. మళ్లీ ఇన్నాళ్లకు ఐపీఎల్లో అడుగుపెట్టాడు.

అయితే అతడు మంచి టచ్ లో కనిపించాడు. నెమ్మదిగా మొదలు పెట్టి జోరు పెంచాడు. ఓవైపు శుభ్‌మన్ గిల్ దంచి కొడుతుంటే.. విలియమ్సన్ అతనికి చక్కని సహకారం అందించాడు. 22 బంతుల్లోనే 4 ఫోర్లతో 26 రన్స్ చేసి అతడు ఔటయ్యాడు. కేన్ ఔటైన తర్వాత సాయిసుదర్శన్ క్రీజులోకి వచ్చాడు. తనదైన స్టైల్లో వచ్చీ రాగానే అతడు బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.

వరుస బౌండరీలతో చెలరేగాడు. సుదర్శన్ 19 బంతుల్లో 33 రన్స్ చేశాడు. గిల్ తో కలిసి మూడో వికెట్ కు 53 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే చివర్లో వచ్చిన రాహుల్ తెవాతియా మ్యాచ్ ను తనదైన స్టైల్లో ముగించాడు. అతడు కేవలం 8 బంతుల్లోనే 23 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

తదుపరి వ్యాసం