తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammed Siraj Ind Vs Sl: సిరాజ్ మియా.. కమాల్ కియా.. చరిత్ర సృష్టించిన భారత పేసర్

Mohammed Siraj IND vs SL: సిరాజ్ మియా.. కమాల్ కియా.. చరిత్ర సృష్టించిన భారత పేసర్

17 September 2023, 16:54 IST

    • Mohammed Siraj IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న ఆసియాకప్ 2023 ఫైనల్‍లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొడ్డటంతో పాటు చరిత్ర సృష్టించాడు. లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.  
మహమ్మద్ సిరాజ్
మహమ్మద్ సిరాజ్ (AFP)

మహమ్మద్ సిరాజ్

Mohammed Siraj IND vs SL: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. శ్రీలంక టాపార్డర్‌ను టపటపా కుప్పకూల్చాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు హైదరాబాదీ బౌలర్ సిరాజ్. అలాగే, కేవలం తన తొలి 16 బంతుల్లోనే ఐదు వికెట్లు తీసి లంకను కుప్పకూల్చాడు. వన్డేల్లో తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శనను సిరాజ్ మియా నమోదు చేశాడు. ఆరో వికెట్ కూడా తీశాడు. ఈ క్రమంలో సిరాజ్ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డేలో అత్యంత వేగంగా (16 బంతులు) 5 వికెట్లు పడొగట్టిన భారత బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. అలాగే, వన్డే క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‍లో అత్యంత వేగంగా ఐదు వికెట్లను పడగొట్టిన అంతర్జాతీయ రికార్డు (చమింద వాస్ - 16 బంతులు)ను కూడా సిరాజ్ సమం చేశాడు. మహమ్మద్ సిరాజ్ విజృంభణతో శ్రీలంక ఓ దశలో 5.4 ఓవర్లలో 12 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత తన ఆరో వికెట్ కూడా తీసుకున్నాడు సిరాజ్. మొత్తంగా 15.2 ఓవర్లలోనే శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

టాస్ గెలిచి శ్రీలంక ముందుగా బ్యాటింగ్‍కు దిగగా తొలి ఓవర్లోనే భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.. కుషాల్ పెరీరా (0)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్లో మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఆ ఓవర్ తొలి బంతికే పాతుమ్ నిస్సంక (2)ను పెవిలియన్‍కు పంపాడు సిరాజ్. జడేజా క్యాచ్ పట్టాడు. అదే ఓవర్లో మూడో బంతికి సదీర సమరవిక్రమ (0)ను ఎల్‍బీడబ్ల్యూ చేశాడు సిరాజ్. ఆ తర్వాతి బాల్‍కే చరిత్ అసలంక (0)ను సిరాజ్ ఔట్ చేశాడు. హ్యాట్రిక్ మిస్ అయినా.. అదే ఓవర్ చివరి బంతికి ధనంజయ డిసిల్వ(4)ను సిరాజ్ ఔట్ చేశాడు. ఇలా.. తన రెండో ఓవర్లోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు సిరాజ్. ఆ తర్వాత ఆరో ఓవర్లో అద్భుతమైన ఔట్ స్వింగర్‌తో శ్రీలంక కెప్టెన్ దసున్ శనక (0)ను సిరాజ్ బౌల్డ్ చేసి.. ఐదు వికెట్లను దక్కించుకున్నాడు. తన తొలి 16 బంతుల్లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. వన్డే కెరీర్‌లో తొలిసారి తన ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

ఆ తర్వాత 12వ ఓవర్లో కుషాల్ మెండిస్‍(17)ను కూడా సిరాజ్ ఔట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‍లో 7 ఓవర్లు వేసిన మహమ్మద్ సిరాజ్ 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.

మొత్తంగా 15.2 ఓవర్లలోనే శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లు తీయగా.. హార్దిక్ మూడు, బుమ్రా ఓ వికెట్ తీశారు.

తదుపరి వ్యాసం