తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl Match World Cup 2023 Highlights: 302 పరుగులతో లంకను చిత్తు చేసిన భారత్.. సెమీస్‌‌లోకి రోహిత్ సేన

Ind vs SL Match World Cup 2023 Highlights: 302 పరుగులతో లంకను చిత్తు చేసిన భారత్.. సెమీస్‌‌లోకి రోహిత్ సేన

Hari Prasad S HT Telugu

02 November 2023, 21:02 IST

  • India vs Sri lanka Live Score: శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్ కప్ సెమీస్ లోకి దూసుకెళ్లింది.

తిరుగులేని టీమిండియా
తిరుగులేని టీమిండియా (PTI)

తిరుగులేని టీమిండియా

India vs Sri lanka Live Score:శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించి వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది టీమిండియా. ఆడిన ఏడు మ్యాచ్ లలోనూ ఇండియా గెలిచింది. లంకను ఏకంగా 302 పరుగులతో ఓడించింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. కేవలం 55 పరుగులకే కుప్పకూలింది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

India vs Sri Lanka Match Live Updates

8.37 PM: India vs Sri Lanka Match Live Updates: ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన మహ్మద్ షమికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

8.35 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా వరుసగా ఏడో విజయంలో వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్లోకి వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది.

8.31 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇండియా ఏకంగా 302 పరుగులతో ఘన విజయం సాధించింది. షమి 5, సిరాజ్ 3, బుమ్రా, జడేజా చెరొక వికెట్ తీసుకున్నారు.

8.25 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక 49 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. షమి 5 వికెట్లు తీసుకున్నాడు. వరల్డ్ కప్ లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఒక ఇన్నింగ్స్ లో అతడు 5 వికెట్లు తీయడం ఇది రెండోసారి.

8.03 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక 8వ వికెట్ కోల్పోయింది. షమి తాను వేసిన 13 బంతుల్లోనే కేవలం ఒక పరుగు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో లంక 29 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

7.56 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక 12 ఓవర్లలో కేవలం 22 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఆ టీమ్ లో నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. సిరాజ్, షమి మూడేసి వికెట్లు తీసుకున్నారు.

7.53 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. షమికి మూడో వికెట్ దక్కింది. చమీర డకౌటయ్యాడు.

7.35 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక వికెట్లు పేకమేడలా కుప్పకూలుతున్నాయి. షమి వరుసగా రెండు వికెట్లు తీయడంతో ఆ టీమ్ 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

7.33 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం 14 పరుగుల దగ్గరే లంక ఐదో వికెట్ కోల్పోవడం విశేషం. షమి తన తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు. అసలంక కూడా కేవలం 1 పరుగు చేసి ఔటయ్యాడు.

7.30 PM: India vs Sri Lanka Match Live Updates: సిరాజ్, బుమ్రా ధాటికి శ్రీలంక కిందా మీదా పడుతోంది. 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 14 పరుగులు మాత్రమే చేసింది.

7.01 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతోంది. సిరాజ్ మూడు వికెట్లతో రెచ్చిపోవడంతో ఆ టీమ్ కేవలం 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కుశల్ మెండిస్ (1) ఔటయ్యాడు.

6.50 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసింది. సమరవిక్రమ కూడా డకౌటయ్యాడు. తొలి ముగ్గురు బ్యాటర్లు డకౌట్లు కావడం విశేషం.

6.46 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. సిరాజ్ కూడా తాను వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. కరుణరత్నె కూడా డకౌటయ్యాడు.

6.40 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ నిస్సంక (0)ను బుమ్రా ఔట్ చేశాడు. తొలి ఓవర్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది.

6.02 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా భారీ స్కోరు చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లి, గిల్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు చేయడంతో 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 రన్స్ చేయడం విశేషం. గిల్ 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. కోహ్లి 88, శ్రేయస్ అయ్యర్ 82 రన్స్ చేశారు. చివర్లో జడేజా 24 బంతుల్లోనే 35 రన్స్ చేశాడు.

శ్రీలంక బౌలర్ దిల్షాన్ మదుశంక 5 వికెట్లు తీసుకున్నాడు. గిల్ 92 బంతుల్లో 92, కోహ్లి 94 బంతుల్లో 88, శ్రేయస్ 56 బంతుల్లోనే 82 రన్స్ చేయడం విశేషం. తొలి ఓవర్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినా.. తర్వాత ఈ ముగ్గురి హాఫ్ సెంచరీలతో టీమిండియా భారీ స్కోరు చేసింది.

5.49 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 56 బంతుల్లోనే 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. లంక బౌలర్ మదుషంక 5 వికెట్లు తీసుకున్నాడు.

5.39 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 46 ఓవర్లలో 5 వికెట్లకు 309 రన్స్ చేసింది.

5.31 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 44 ఓవర్లలో 5 వికెట్లకు 295 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

5.20 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ 12 పరుగులు చేసి ఔటయ్యాడు.

5.10 PM: India vs Sri Lanka Match Live Updates: సూర్యకుమార్ యాదవ్ వచ్చీ రాగానే రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఇండియా 40 ఓవర్లలో 4 వికెట్లకు 264 రన్స్ చేసింది.

5.05 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఇండియా 256 పరుగుల దగ్గర నాలుగో వికెట్ కోల్పోయింది.

4.50 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 36 ఓవర్లలో 3 వికెట్లకు 239 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. అతడు ఏకంగా 106 మీటర్ల సిక్స్ కొట్టడం విశేషం.

4.29 PM: India vs Sri Lanka Match Live Updates: విరాట్ కోహ్లి కూడా సెంచరీ మిస్సయ్యాడు. 94 బంతుల్లో 88 పరుగులు చేసిన విరాట్.. మూడో వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో ఇండియా 196 పరుగుల దగ్గర మూడో వికెట్ కోల్పోయింది.

4.21 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ సెంచరీ ముందు 92 పరుగుల దగ్గర ఔటయ్యాడు. మరోసారి మదుషంకనే వికెట్ తీశాడు. దీంతో కోహ్లి, గిల్ 189 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ లతో 92 రన్స్ చేశాడు. ఏడో సెంచరీకి 8 పరుగుల దూరంలో ఆగిపోయాడు.

4.15 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 185 రన్స్ చేసింది. కోహ్లి, గిల్ సెంచరీలపై కన్నేశారు. ఇద్దరూ 86 పరుగులపైనే ఉండటం విశేషం.

3.58 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా ఇన్నింగ్స్ సగం ఓవర్లు ముగిశాయి. వికెట్ నష్టానికి 151 రన్స్ చేసింది. కోహ్లి, గిల్ హాఫ్ సెంచరీలు చేసి.. సెంచరీల వైపు దూసుకెళ్తున్నారు.

3.44 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 22 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 132 రన్స్ చేసింది. కోహ్లి, గిల్ ఇప్పటికే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

3.33 PM: India vs Sri Lanka Match Live Updates: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో అతనికిది రెండో హాఫ్ సెంచరీ. దీంతో ఇండియన్ టీమ్ 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 రన్స్ చేసింది. కోహ్లి కూడా హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

3.23 PM: India vs Sri Lanka Match Live Updates: విరాట్ కోహ్లి వరల్డ్ కప్ 2023లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో అతనికిది 70వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అటు ఇండియా కూడా 17వ ఓవర్లో 100 పరుగులు దాటింది.

3.10 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 14 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 85 రన్స్ చేసింది. కోహ్లి 39, గిల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో బంతికే రోహిత్ (4) ఔటైనా.. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు ఇప్పటికే 81 రన్స్ జోడించారు.

3.01 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 రన్స్ చేసింది. కోహ్లి 35, గిల్ 26 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

2.52 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా తొలి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 60 రన్స్ చేసింది. కోహ్లి, గిల్ రెండో వికెట్ కు ఇప్పటికే 56 పరుగులు జోడించారు.

2.39 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 రన్స్ చేసింది. కోహ్లి, గిల్ ఇన్నింగ్స్ ను మళ్లీ నిలబెడుతున్నారు.

2.28 PM: India vs Sri Lanka Match Live Updates: ఆరో ఓవర్లో విరాట్ కోహ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చమీర తన బౌలింగ్ లోనే కోహ్లి ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేశాడు.

2.20 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా 4 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 14 రన్స్ చేసింది. రెండో బంతికే రోహిత్ ఔటవడంతో గిల్, కోహ్లి ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో ఓవర్ లో కోహ్లి ఒక్క పరుగూ తీయలేదు.

2.10 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా రెండు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 8 రన్స్ చేసింది.

2.01 PM: India vs Sri Lanka Match Live Updates: ఇండియా రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. తొలి బంతికే ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ (4) రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

1.42 PM: India vs Sri Lanka Match Live Updates:శ్రీలంక జ‌ట్టు ఇదే: నిసాంక‌, క‌రుణ ర‌త్నే, కుశాల్ మెండిస్ (కెప్టెన్‌), స‌మ‌ర‌విక్ర‌మ‌, అసలంక‌, మాథ్యూస్‌, హేమంత‌, తీక్ష‌ణ‌, ర‌జిత, చ‌మీర‌, మ‌ధుషంక‌

1.40 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక తుది జ‌ట్టులో ఒక మార్పు చేసింది. ధ‌నుంజ‌య డిసిల్వా స్థానంలో హేమంత జ‌ట్టులోకి వ‌చ్చాడు.

1.38 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక‌తో మ్యాచ్‌లో ఇండియా ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బ‌రిలో దిగుతోంది.

ఇండియా జ‌ట్టు ఇదే: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్య‌కుమార్‌, శుభ్ మ‌న్ గిల్‌, జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్‌, బుమ్రా, సిరాజ్‌

1.30PM: India vs Sri Lanka Match Live Updates: వాంఖ‌డే వేదిక‌గా జ‌రుగుతోన్న వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి టీమ్ ఇండియాకు బ్యాటింగ్ అప్ప‌గించింది.

1.23 PM: India vs Sri Lanka Match Live Updates: మ‌రికొద్ది సేప‌ట్లో ఇండియా, శ్రీలంక మ్యాచ్ టాస్ పండ‌నుంది.వాంఖ‌డే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించే అవ‌కాశం ఉన్న‌ట్లు క్రికెట్ విశ్లేష‌కులు చెబుతోన్నారు. నేటి మ్యాచ్‌లో ప‌రుగుల‌ వ‌ర‌ద పార‌డం ఖాయ‌మ‌ని చెబుతోన్నారు.

12.50 PM: India vs Sri Lanka Match Live Updates: నేటి మ్యాచ్‌లో శ్రీలంక‌పై టీమిండియా విజ‌యాన్ని సాధిస్తే సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టిన తొలి టీమ్‌గా నిలుస్తుంది.

12.08 PM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక‌తో మ్యాచ్‌లో ఆశ్విన్‌ను ఆడించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కుల్దీప్ యాద‌వ్‌, జ‌డేజాతో పాటు అశ్విన్...ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో టీమ్ ఇండియా బ‌రిలో దిగ‌నున్న‌ట్లు స‌మాచారం.

11.05 AM: India vs Sri Lanka Match Live Updates: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ఫామ్ టీమ్ ఇండియాను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు మ్యాచుల్లో కేవ‌లం 134 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌. నేటి మ్యాచ్‌లో శ్రేయ‌స్ రాణించ‌డం కీల‌కంగా మారింది.

11.02 AM: India vs Sri Lanka Match Live Updates: శ్రీలంక‌పై వ‌న్డేల్లో కోహ్లి 10 సెంచ‌రీలు చేశారు. వ‌న్డేలో ఓ జ‌ట్టుపై కోహ్లి చేసిన అత్య‌ధిక సెంచ‌రీలు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. నేటి మ్యాచ్‌లో కోహ్లి సెంచ‌రీ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిమానులు చెబుతోన్నారు.

9.40 AM: India vs Sri Lanka Match Live Updates: వన్డేల్లో శ్రీలంకపై టీమిండియాకు తిరుగులేని రికార్డ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 98 వ‌న్డేల్లో శ్రీలంక‌పై టీమిండియా విజ‌యం సాధించ‌గా ...శ్రీలంక 57 సార్లు భార‌త్‌ను ఓడించింది. 11 మ్యాచ్‌లు ఫ‌లితం తేల‌కుండా ముగిశాయి.

9.36 AM: India vs Sri Lanka Match Live Updates: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా, శ్రీలంక ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిదిసార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో చెరో నాలుగు విజ‌యాల‌తో రెండు జ‌ట్టు స‌మానంగా ఉన్నాయి. ఒక మ్యాచ్ ఫ‌లితం తేల‌లేదు.

తదుపరి వ్యాసం