తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 1st Odi: దక్షిణాఫ్రికాతో వన్డే సమరానికి భారత్ రెడీ.. సంజూకు ఛాన్స్ దక్కుతుందా! మ్యాచ్ టైమింగ్, లైవ్ వివరాలు

IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికాతో వన్డే సమరానికి భారత్ రెడీ.. సంజూకు ఛాన్స్ దక్కుతుందా! మ్యాచ్ టైమింగ్, లైవ్ వివరాలు

16 December 2023, 20:06 IST

    • India vs South Africa 1st ODI: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‍కు భారత్ రెడీ అయింది. మూడు వన్డేల సిరీస్ ఆదివారం (సెప్టెంబర్ 17) మొదలుకానుంది. ఆ వివరాలివే..
IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికాతో వన్డే సమరానికి భారత్ రెడీ
IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికాతో వన్డే సమరానికి భారత్ రెడీ (AFP)

IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికాతో వన్డే సమరానికి భారత్ రెడీ

India vs South Africa 1st ODI: దక్షిణాఫ్రికా గడ్డపై ఆతిథ్య టీమ్‍పై టీ20 సిరీస్‍ను సమం చేసుకున్న టీమిండియా.. వన్డే సమరానికి సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ఆదివారం (డిసెంబర్ 17) మొదలుకానుంది. ఈ సిరీస్‍లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ వన్డే సిరీస్‍కు కూడా రెస్ట్ తీసుకోవటంతో రాహుల్ జట్టు పగ్గాలు చేపడుతున్నాడు. జొహన్నెస్‍బర్గ్‌లోని వాండెరర్స్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ టైమింగ్, లైవ్, తుది జట్లు ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

సంజూకు చోటు దక్కుతుందా..!

దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‍కు మాత్రమే ఎంపికైన సంజూ శాంసన్‍కు తొలి వన్డేలో తుదిజట్టులో చోటు దక్కుతుందా అన్నదే ఉత్కంఠగా మారింది. టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకున్న అతడు.. తొలి వన్డే ఆడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు 13 వన్డేల్లో 390 పరుగులతో రాణించిన సంజూకు.. భారత జట్టులో స్థిరంగా చోటు దక్కడం లేదు. అయితే, తనను మరోసారి నిరూపించుకునేందుకు దక్షిణాఫ్రికా గడ్డపై సంజూకు అవకాశం దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 

భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే డేట్, టైమ్ వివరాలు

భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ఆదివారం (డిసెంబర్ 17) జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు టాస్ పడుతుంది.

ఈ మ్యాచ్ లైవ్ వివరాలు

భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ కానుంది. డిజిటల్ విషయానికి వస్తే.. డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. సౌతాఫ్రికాలోని జొహెన్నెస్‍బర్గ్ న్యూ వాండెడర్స్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

రింకూ అరంగేట్రం!తుది జట్లు (అంచనా)

ఈ మ్యాచ్ ద్వారా భారత యంగ్ స్టార్ రింకూ సింగ్ వన్డేల్లోనూ అరంగేట్రం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. టీ20ల్లో సూపర్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ.. వన్డేల్లోనూ సత్తాచాటేందుకు రెడీ అయ్యాడు. వన్డేల్లోనూ ఫినిషర్‌ రోల్‍నే అతడికి ఇచ్చే అవకాశం ఉంది.

భారత తుది జట్టు (అంచనా): రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, సంజూ శాంసన్ / తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్

దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా): టోనీ జీ జోర్జీ, రీజా హెండ్రిక్స్, రాసీ వాండెర్ డసెన్, ఐడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఆండ్లీ ఫెలుక్వాయో, వియాన్ ముడ్లర్, కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షంషి, లిజార్డ్ విలియమ్స్

ఈ సిరీస్‍లో డిసెంబర్ 19న రెండో వన్డే, డిసెంబర్ 21న మూడో వన్డే జరగనుంది. అనంతరం డిసెంబర్ 26 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది.

తదుపరి వ్యాసం