తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus: ప్రపంచకప్ ఫైనల్‍లో చతికిలపడిన టీమిండియా.. టైటిల్ ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా

IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్‍లో చతికిలపడిన టీమిండియా.. టైటిల్ ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా

11 February 2024, 21:06 IST

    • India vs Australia Under 19 World Cup Final: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‍లో భారత యువ జట్టుకు నిరాశ ఎదురైంది. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. లక్ష్యఛేదనలో ఒత్తిడికి గురై చతికిలపడింది.
IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్‍లో చతికిలపడిన టీమిండియా.. టైటిల్ ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా
IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్‍లో చతికిలపడిన టీమిండియా.. టైటిల్ ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా (AFP)

IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్‍లో చతికిలపడిన టీమిండియా.. టైటిల్ ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా

IND vs AUS U19 World Cup 2024 Final: అండర్-19 ప్రపంచకప్‍-2024 టైటిల్ ఫైట్‍లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఫైనల్ వరకు అజేయంగా దూసుకొచ్చిన యంగ్ టీమిండియా.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. గతేడాది భారత్ సీనియర్ టీమ్ కూడా వన్డే ప్రపంచకప్‍లో ఫైనల్‍లో అడుగుపెట్టగా.. ఆస్ట్రేలియానే దెబ్బకొట్టింది. ఇప్పుడు భారత అండర్-19 జట్టును కూడా ఆసీస్ యువ జట్టు తుదిపోరులో దెబ్బ తీసింది. దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా నేడు (ఫిబ్రవరి 11) జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‍లో భారత్ 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్‍గా ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టిన భారత్.. రన్నరప్‍తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనల్‍లో చతికిలపడిన భారత్‍కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

ఈ ఫైనల్ ఫైట్‍లో 254 పరుగుల లక్ష్యఛేదనలో భారత అండర్-19 జట్టు కుప్పకూలింది. 43.5 ఓవర్లలో 174పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) మొదట్లో ఆకట్టుకోగా.. చివర్లో మురుగన్ అభిషేక్ (42) పోరాడాడు. అయితే, ముఖ్యమైన ఈ ఫైనల్‍లో మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో టీమిండియాకు ఓటమి ఎదురైంది. ఏడుగురు భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమై నిరాశపరిచారు. ముషీర్ ఖాన్ (22) కాసేపు నిలువగా.. భారీ అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ ఉదయ్ సహరన్ (8), సచిన్ దాస్ (9) కీలకమైన తుదిపోరులో విఫలమయ్యారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మాహిల్ బియర్డ్ మ్యాన్, రాఫ్ మ్యాక్‍మిలాన్ చెరో మూడు వికెట్లతో రాణించగా.. కాలమ్ విడ్లెర్ రెండు, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రేకర్ తలా వికెట్ తీశారు. మొత్తంగా ఐదుసార్లు అండర్-19 ఛాంపియన్ టీమిండియాకు ఈసారి ఆస్ట్రేలియా షాకిచ్చింది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఆసీస్ తరఫున భారత సంతతి ప్లేయర్ హర్జాస్ సింగ్ (55) హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఒలీవర్ పీక్ (46 నాటౌట్), హ్యారీ డిక్సన్ (42) కూడా రాణించారు. భారత పేసర్ రాజ్ లింబానీ 10 ఓవర్లలో 38 పరుగులే ఇచ్చి మూడు వికెట్లతో రాణించాడు. నమన్ తివారీ రెండు వికెట్లు తీసుకున్నాడు. 

ఆరంభం నుంచే ఒత్తిడి

లక్ష్యఛేదనలో భారత జట్టు ఆరంభం నుంచి ఒత్తిడిలోనే కనిపించింది. ఫైనల్‍లో బ్యాటర్ల ప్రెజర్‌ స్పష్టంగా తెలిసిపోయింది. తొలి రెండు ఓవర్లలో కేవలం ఒక పరుగే వచ్చింది. మూడో ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ ఖాన్ (3) వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా టీమిండియాకు కష్టంగానే పరుగులు వచ్చాయి. 10 ఓవర్లలో 28 రన్సే వచ్చాయి. ముషీర్ ఖాన్ (22), కెప్టెన్ ఉదయ్ సహరన్ (8), సచిన్ దాస్ (9), ప్రియాన్షు మోలియా (9), అరవెల్లి అవినాశ్ (0) వెనువెంటనే ఔటయ్యారు. దీంతో 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది భారత్. 

నిలకడగా ఆడి పరుగులు రాబట్టిన ఆదర్శ్ సింగ్ కూడా 31వ ఓవర్లో వెనుదిరిగాడు. రాజ్ లింబానీ (0) డకౌట్ కాగా.. చివర్లో మురుగన్ అభిషేక్ (42) అద్భుత పోరాటం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. ఓటమి అంతరాన్ని మాత్రం తగ్గించగలిగాడు. అతడు 41 ఓవర్లో వెనుదిరిగాడు. నమన్ తివారీ (14 నాటౌట్) అజేయంగా నిలువగా.. సౌమీ పాండే (2) ఔటవటంతో టీమిండియా ఆలౌటైంది. ప్రపంచకప్  ఫైనల్‍లో ఓడి భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశచెందారు. 

తదుపరి వ్యాసం