తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ian Chappell On Shreyas Iyer: ఇకనైనా శ్రేయస్ అయ్యర్‌ని మరీ ఎక్కువ చేసి చూడకండి: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సలహా

Ian Chappell on Shreyas Iyer: ఇకనైనా శ్రేయస్ అయ్యర్‌ని మరీ ఎక్కువ చేసి చూడకండి: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సలహా

Hari Prasad S HT Telugu

12 February 2024, 12:37 IST

    • Ian Chappell on Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇకనైనా అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరీ ఎక్కువ చేసి చూపకండి అని సలహా ఇవ్వడం గమనార్హం.
శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఎక్కువ చేసి చూడకండన్న ఇయాన్ ఛాపెల్
శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఎక్కువ చేసి చూడకండన్న ఇయాన్ ఛాపెల్ (PTI)

శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఎక్కువ చేసి చూడకండన్న ఇయాన్ ఛాపెల్

Ian Chappell on Shreyas Iyer: వరుసగా విఫలమవుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరీ ఎక్కువ చేసి చూడటం సెలక్టర్లు ఆపాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. ఇంగ్లండ్ తో మిగిలిన మూడు టెస్టులకు అతన్ని పక్కన పెట్టిన తర్వాత అతడు ఈ కామెంట్స్ చేశాడు. ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

శ్రేయస్ అయ్యర్‌పై ఇయాన్ ఛాపెల్

ఇంగ్లండ్ తో మిగిలిన మూడు టెస్టులకు టీమ్ ను ఎంపిక చేసే సమయంలో శ్రేయస్ అయ్యర్ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అతడు మరోసారి వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, 30 బంతుల కంటే ఎక్కువ ఆడితే గాయం తిరగబెడుతోందని చెప్పినా ఈ వేటుకు అతని ఫామ్ లేమి కూడా కారణమే అని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రికిన్ఫోకు రాసిన కాలమ్ లో ఇయాన్ ఛాపెల్ స్పందించాడు.

"ఇండియా బలమైన టీమ్. వాళ్లకు రోహిత్ శర్మ రూపంలో మంచి లీడర్ కూడా ఉన్నాడు. ఇక వాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం నుంచి కోలుకొని వస్తే మరింత స్ట్రాంగ్ అవుతారు. కానీ కోహ్లి మిగతా సిరీస్ కు లేకపోవడం మాత్రం వాళ్లకు దెబ్బే. ఇకనైనా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేయడాన్ని సెలెక్టర్లు ఆపేస్తారని ఆశిస్తున్నా. అలాగే కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ సామర్థ్యాన్ని మరింత గుర్తించాలి" అని ఛాపెల్ అనడం గమనార్హం.

ఇక ఈ సిరీస్ ఇండియానే గెలుస్తుందని కూడా ఛాపెల్ అంచనా వేశాడు. "ఈ కఠినమైన సిరీస్ ను చివరికి ఇండియానే గెలుస్తుంది. కానీ దానికోసం వాళ్లు చాలా పోరాడాలి. ఇంగ్లండ్ టీమ్ దూకుడైన స్టోక్స్ కెప్టెన్సీలో దూసుకెళ్తోంది. అంతకుముందు జో రూట్ కెప్టెన్సీ అసలు బాగా లేదు. గత పర్యటనలో వాళ్లు స్పిన్ కు లొంగిపోయారు" అని ఛాపెల్ అన్నాడు.

శ్రేయస్ అయ్యర్ ఫామ్ లేమి

శ్రేయస్ అయ్యర్ గతేడాది కూడా చాలా రోజుల పాటు వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత వన్డేల్లో తనను తాను నిరూపించుకొని వరల్డ్ కప్ జట్టులోనూ చోటు సంపాదించాడు. కొన్ని మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అయితే ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు.

తొలి టెస్టులో 35, 13 స్కోర్లు చేయగా.. రెండో టెస్టులో 27, 29 మాత్రమే చేయగలిగాడు. దీంతో మిగిలిన మూడు టెస్టుల నుంచి అయ్యర్ ను సెలెక్టర్లు తప్పించారు. నిజానికి గాయం అని వార్తలు వచ్చినా.. టీమ్ ఎంపిక సమయంలో దాని గురించి సెలక్టర్లు ప్రస్తావించకపోవడం చూస్తుంటే.. వేటు వేసినట్లు కనిపిస్తోంది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ లో జరగనుంది.

మిగిలిన మూడు టెస్టులకు కూడా కోహ్లి దూరం కాగా.. రెండో టెస్టుకు దూరమైన రాహుల్, జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు.

తదుపరి వ్యాసం