తెలుగు న్యూస్  /  క్రికెట్  /  England Vs New Zealand: వికెట్లు పారేసుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు.. న్యూజిలాండ్ ముందు మోస్తరు టార్గెట్

England vs New Zealand: వికెట్లు పారేసుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు.. న్యూజిలాండ్ ముందు మోస్తరు టార్గెట్

Hari Prasad S HT Telugu

05 October 2023, 17:36 IST

    • England vs New Zealand: వికెట్లు పారేసుకున్నారు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ బ్యాటర్లు. దీంతో న్యూజిలాండ్ ముందు మోస్తరు టార్గెట్ మాత్రమే ఉంచగలిగారు.
న్యూజిలాండ్ బౌలర్ల ముందు బోల్తా కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు
న్యూజిలాండ్ బౌలర్ల ముందు బోల్తా కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు (AP)

న్యూజిలాండ్ బౌలర్ల ముందు బోల్తా కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు

England vs New Zealand: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. భారీ షాట్లకు పోయి వికెట్లు పారేసుకున్నారు. ఒక్క జో రూట్ మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా 42 బంతుల్లోనే 43 రన్స్ చేసినా.. దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

దీంతో ఇంగ్లండ్ టీమ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 రన్స్ చేయగలిగింది. జో రూట్ 86 బంతుల్లో 77 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 10 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో రెండు వికెట్లు తీశారు. స్పిన్నర్ రచిన్ రవీంద్ర మాత్రమే 10 ఓవర్లలో ఏకంగా 76 రన్స్ ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు.

అంతకుముందు వరల్డ్ కప్ ను ఓ సూపర్ సిక్స్ తో ప్రారంభించాడు ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు బెయిర్‌స్టో మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. ఆ టీమ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్ మలన్ 14 పరుగులు చేశారు.

ఇక హ్యారీ బ్రూక్ 25, మొయిన్ అలీ 11, జోస్ బట్లర్ 43, లియామ్ లివింగ్‌స్టోన్ 20, సామ్ కరన్ 14, క్రిస్ వోక్స్ 11 రన్స్ చేశారు. టెస్ట్ క్రికెట్ లో బజ్‌బాల్ అంటూ వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడే స్టైల్ కనిపెట్టిన ఇంగ్లండ్.. ఇప్పుడు వన్డేల్లోనూ అలాంటి ఆటే ఆడటానికి ప్రయత్నించి వికెట్లు పారేసుకుంది. ఈ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాదాపు ఖాళీ స్టాండ్స్ మధ్యే జరుగుతుండటం గమనార్హం.

తదుపరి వ్యాసం