తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner: ఆస్ట్రేలియా క్రికెట్‌లో దుమారం.. వార్నర్ విషయంలో మాజీల మధ్య గొడవ

David Warner: ఆస్ట్రేలియా క్రికెట్‌లో దుమారం.. వార్నర్ విషయంలో మాజీల మధ్య గొడవ

Hari Prasad S HT Telugu

04 December 2023, 11:58 IST

    • David Warner: ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ కొత్త దుమారం రేగింది. డేవిడ్ వార్నర్ ను పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయడంపై అక్కడి మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (AP)

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్

David Warner: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్, చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ, మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కారణం ఆ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. పాకిస్థాన్ తో జరగబోయే తొలి టెస్ట్ కు వార్నర్ ను ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ చాలా తీవ్రంగా స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదంలో ప్రధాన పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్ ను ఓ హీరోలాగా వీడ్కోలు పలకడం ఏంటని జాన్సన్ ప్రశ్నించాడు. ఆ వివాదంలో ఎప్పుడూ వార్నర్ తన పాత్ర గురించి స్పందించలేదని, మరి అలాంటి వ్యక్తికి తన రిటైర్మెంట్ టెస్టును స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశం ఎలా కల్పిస్తారంటూ మండిపడ్డాడు.

వార్నర్‌కు ఎందుకంత గౌరవం?

ఓ పత్రికకు రాసిన కాలమ్ లో వార్నర్ పై జాన్సన్ గరంగరం అయ్యాడు. "డేవిడ్ వార్నర్ వీడ్కోలు సిరీస్ కు సిద్ధమవుతున్న వేళ ఇది ఎందుకు జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? టెస్టుల్లో ఆడటానికి ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి ఎందుకు తన చివరి టెస్ట్ ఆడే అవకాశం కల్పిస్తున్నారు? ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అతిపెద్ద వివాదాల్లో ఒకటైన బాల్ టాంపరింగ్ లో ప్రధాన పాత్ర పోషించిన ప్లేయర్ కు హీరోలాగా వీడ్కోలు పలకడమేంటి?" అని జాన్స్ ప్రశ్నించాడు.

దీనిపై చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ కూడా తీవ్రంగానే స్పందించాడు. జాన్సన్ బాగానే ఉన్నాడా అని అతడు అన్నాడు. డేవిడ్ వార్నర్ ను సమర్థించేలా బెయిలీ మాట్లాడాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో ఎంతో కాలంగా ఓపెనర్ గా గొప్ప సేవలు అందించిన వార్నర్ కు ఇలాంటి వీడ్కోలు కచ్చితంగా అవసరమే అని స్పష్టం చేశాడు. మరో మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా జాన్సన్ కామెంట్స్ ను తప్పుబట్టాడు.

ఇలా వ్యక్తిగత దాడికి దిగడం సరికాదని సూచించాడు. గతంలో జాన్సన్, వార్నర్ లకు కెప్టెన్ గా ఉన్న క్లార్క్.. అసలు ఈ ప్లేయర్స్ మధ్య గొడవ గురించి స్పందించాడు. వాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని, అయితే జట్టుకు ఏది మంచిదో అది జరగాలి తప్ప వ్యక్తిగత విమర్శలు సరికాదని క్లార్క్ అన్నాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య డిసెంబర్ 14 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. వార్నర్ కు కెరీర్లో ఇదే చివరి టెస్ట్ కానుంది.

తదుపరి వ్యాసం