తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner: ఎట్టకేలకు జాన్సన్‍ విమర్శలపై స్పందించిన డేవిడ్ వార్నర్.. అదిరిపోయే కౌంటర్

David Warner: ఎట్టకేలకు జాన్సన్‍ విమర్శలపై స్పందించిన డేవిడ్ వార్నర్.. అదిరిపోయే కౌంటర్

08 December 2023, 16:44 IST

    • David Warner: మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శలపై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు స్పందించాడు. ఈ అంశంపై మౌనం వీడిన వార్నర్.. జాన్సన్‍కు కౌంటర్ ఇచ్చాడు. ఆ వివరాలివే..
డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ (ANI )

డేవిడ్ వార్నర్

David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఆ దేశానికే చెందిన మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‍తో జరగనున్న టెస్టు సిరీస్‍కు వార్నర్‌ను ఎంపిక చేయడం పట్ల జాన్సన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‍ ఆడి టెస్టు క్రికెట్‍కు వీడ్కోలు పలకాలని వార్నర్ డిసైడ్ చేసుకున్నాడు. దీంతో సెలెక్టర్లు అతడికి అవకాశం ఇచ్చి.. ‘హీరో సెండాఫ్’ పలకాలని నిర్ణయించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

అయితే, హీరో సెండాఫ్‍కు డేవిడ్ వార్నర్ అర్హుడు కాదంటూ మిచెల్ జాన్సన్ వివాదానికి తెరతీశాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్‍కు పాల్పడిన వార్నర్‌కు ఘనమైన వీడ్కోలు పలకడం సరికాదనేలా ఓ కాలమ్ రాశాడు. దీంతో చాలా మంది జాన్సన్‍పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంపై ఇంతకాలం మౌనం పాటించిన డేవిడ్ వార్నర్.. ఎట్టకేలకు స్పందించాడు. హుందాగా జాన్సన్‍కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.

తల్లిదండ్రులు నేర్పినట్టుగా ప్రతీ రోజు కష్టపడుతూ తాను ముందుకు సాగుతున్నానని డేవిడ్ వార్నర్ ఫాక్స్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రతీ ఒక్కరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయని, కానీ వాటిని తాను పట్టించుకోనని వార్నర్ చెప్పాడు. ఏదో హాట్ టాపిక్ హెడ్‍లైన్‍లో లేకుండా సమ్మర్ సీజన్‍లో క్రికెట్ ఉండదని అన్నాడు.

“ప్రతీ ఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. అన్నింటినీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందుకు సాగుతుండాలి. మంచి టెస్టు సిరీస్ ఆడాలని మేం ఎదురుచూస్తున్నాం” అని వార్నర్ చెప్పాడు.

తాను పెరిగిన వాతావరణమే కష్టాలను తట్టుకునేలా సాయం చేస్తోందని డేవిడ్ వార్నర్ వెల్లడించారు. “నా తల్లిదండ్రులు నన్ను గొప్పగా పెంచారు. ప్రతీరోజు కష్టపడి పని చేయడం నేర్పారు. ఆ విషయాన్ని నాలో నాటారు” అని వార్నర్ పేర్కొన్నాడు.

“ప్రపంచమంతా మీపై దృష్టి సారించినప్పుడు.. ఏం జరుగుతుందో తెలియదు. చాలా మీడియా ఉంది. చాలా విమర్శలు వస్తుంటాయి. కానీ అందులోనూ పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఆటకు, క్రికెట్ ఆస్ట్రేలియాకు మద్దతు ఇచ్చేందుకు ప్రజలు ముందుకు వస్తుండడం చాలా ముఖ్యమైన విషయం అని నేను భావిస్తున్నాను. ఇది అద్భుతమైనది” అని వార్నర్ చెప్పాడు.

ఈ విషయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. డేవిడ్ వార్నర్‌కు మద్దతుగా నిలిచాడు. వార్నర్‌కు ఘనమైన వీడ్కోలు ఉండాలని అభిప్రాయపడ్డాడు. చాలా మంది మాజీలు కూడా వార్నర్‌కే సపోర్ట్ చేస్తున్నారు. 

తదుపరి వ్యాసం