తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner Helicopter: క్రికెట్ మ్యాచ్ కోసం హెలికాప్టర్‌లో వచ్చిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్

David Warner Helicopter: క్రికెట్ మ్యాచ్ కోసం హెలికాప్టర్‌లో వచ్చిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

12 January 2024, 15:53 IST

    • David Warner Helicopter: ఈ మధ్యే టెస్ట్, వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఓ క్రికెట్ మ్యాచ్ కోసం హెలికాప్టర్ లో గ్రౌండ్ కి రావడం విశేషం. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో హెలికాప్టర్ లో డేవిడ్ వార్నర్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో హెలికాప్టర్ లో డేవిడ్ వార్నర్

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో హెలికాప్టర్ లో డేవిడ్ వార్నర్

David Warner Helicopter: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కు హాలీవుడ్ స్టైల్లో ఓ హెలికాప్టర్ లో రావడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో వైరల్ గా మారింది. బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ కోసం వార్నర్ ఓ చాపర్ లో వచ్చాడు. దానిని నేరుగా ఎస్‌సీజీలోనే దింపి.. అందులో నుంచి ఓ హీరోలాగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

డేవిడ్ వార్నర్ ఇలా హెలికాప్టర్ లో గ్రౌండ్ లో అడుగుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సోదరుడి పెళ్లికి వెళ్లిన వార్నర్.. చివరి నిమిషంలో ఈ మ్యాచ్ కోసం వచ్చాడు. దీంతో చాపర్ ను నేరుగా గ్రౌండ్ లోనే అతడు దింపడం విశేషం. తాను ఎక్కడైతే కెరీర్లో చివరి టెస్ట్ ఆడాడో అదే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో,థ్యాంక్స్ డేవ్ అని తనకు ఫేర్‌వెల్ చెప్పిన చోటే దిగాడు.

క్రికెట్‌లో నెవ్వర్ బిఫోర్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్

క్రికెట్ లో ఇప్పటి వరకూ చూడని ఎంట్రీ ఇది. సాధారణంగా ఏ క్రికెట్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా ప్లేయర్స్ కొన్ని గంటల ముందుగానే స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉంటారు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం ఇలా మ్యాచ్ కు ఆలస్యమవుతోందంటూ చివరి నిమిషంలో ఏకంగా హెలికాప్టర్ వేసుకొని నేరుగా గ్రౌండ్ లోనే దిగడం మాత్రం గతంలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.

బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్ టీమ్ తరఫున వార్నర్ ఆడుతున్నాడు. ఈ లెవల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత రన్స్ చేయకపోతే అస్సలు బాగుండదని, అందుకే తన టీమ్ కు మిగిలిన మూడు మ్యాచ్ లలో సాధ్యమైనన్ని రన్స్ చేయాలని భావిస్తున్నట్లు అతడు చెప్పాడు. ఈ మ్యాచ్ కోసం ఇక్కడికి రావడానికే తాను తన అత్యుత్తమ ప్రయత్నం చేశానని, ఇక పరుగులు కూడా చేస్తే బాగుంటుందని అన్నాడు.

"ఇప్పుడు నేను రన్స్ చేయకపోతే నన్న అందరూ వింతగా చూస్తారు. కానీ ఇది కేవలం బీబీఎల్ కే కాదు.. ఆస్ట్రేలియా క్రికెట్ కు కూడా నా కంట్రిబ్యూషన్. ఎలాగైనా ఇక్కడికి రావాలని అనుకున్నాను. వినోదం పంచాలని అనుకున్నాను. తర్వాతి మూడు మ్యాచ్ లలో నా టీమ్ ను గెలిపించాలని భావించాను" అని వార్నర్ అన్నాడు.

తన బ్యాటింగ్ లాగే ఫీల్డ్ లోకి తన ఎంట్రీ కూడా ఓ రేంజ్ లో ఉండేలా చూసుకున్నాడు వార్నర్. గతేడాదే బీబీఎల్ టీమ్ సిడ్నీ థండర్ తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత సిడ్నీ థండర్ ఆడాల్సిన చివరి మూడు మ్యాచ్ ల కోసం వార్నర్ వచ్చాడు. నిజానికి ఈ సీజన్ లో సిడ్నీ థండర్ టీమ్ నాకౌట్స్ కు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఒకవేళ అర్హత సాధించినా.. వార్నర్ ఆ మ్యాచ్ లు ఆడే పరిస్థితి లేదు. యూఏఈలో జరిగే ఐఎల్‌టీ20 కోసం వార్నర్ వెళ్లాల్సి ఉండటమే దీనికి కారణం. ఆ లీగ్ లో అతడు దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పటికీ ఆస్ట్రేలియా టీ20 టీమ్ కు అందుబాటులో ఉన్న వార్నర్.. మిగతా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్స్ తో కాలం గడపనున్నాడు.

తదుపరి వ్యాసం