తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ambati Rayudu: సీఎం జగన్‌పై దుష్ప్రచరాలు.. అసలు నిజాలు తెలుస్తాయన్న క్రికెటర్ అంబటి రాయుడు

Ambati Rayudu: సీఎం జగన్‌పై దుష్ప్రచరాలు.. అసలు నిజాలు తెలుస్తాయన్న క్రికెటర్ అంబటి రాయుడు

Sanjiv Kumar HT Telugu

25 December 2023, 8:16 IST

  • Ambati Rayudu Speech At Vyooham Pre Release Event: రామ్ గోపాల్ వర్మ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను జగ గర్జన పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్ గురించి క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సీఎం జగన్‌పై దుష్ప్రచరాలు.. అసలు నిజాలు తెలుస్తాయన్న క్రికెటర్ అంబటి రాయుడు
సీఎం జగన్‌పై దుష్ప్రచరాలు.. అసలు నిజాలు తెలుస్తాయన్న క్రికెటర్ అంబటి రాయుడు

సీఎం జగన్‌పై దుష్ప్రచరాలు.. అసలు నిజాలు తెలుస్తాయన్న క్రికెటర్ అంబటి రాయుడు

Ambati Rayudu About Jagan In Jaga Garjana: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన సినిమా వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా పొలిటికల్ థ్రిల్లర్‌గా వ్యూహం సినిమా తెరకెక్కించారు. ఇదివరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ డైరెక్ట్ చేసిన ఆర్జీవీ ఇప్పుడు వ్యూహంతో రావడంపై అంచనాలు నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన

DC vs LSG: స్టబ్స్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ దీటైన స్కోరు.. సూపర్ క్యాచ్ పట్టిన రాహుల్.. చప్పట్లతో అభినందించిన ఓనర్

Rohit Sharma: టీ20 ప్రపంచకప్‍కు ముందు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడంపై స్పందించిన సౌరవ్ గంగూలీ

Rohit Sharma vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్

వ్యూహం సినిమా ఈ నెల 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జగ గర్జన పేరుతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్‌తోపాటు క్రికెటర్ అంబటి రాంబాబు కూడా హాజరయ్యాడు. ఈ వేదికగా అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"ప్రతి ఒక్క మనిషి జీవితంలో సంతోషం తీసుకురావాలని ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి, మన రాష్ట్రం ప్రతి రంగంలో ఎంతోముందుకు ఎదిగి ఇండియాలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకోవాలని కోరుకునే మన నాయుకుడు జగన్ గారు. అలాంటి జగన్ గారి లైఫ్ స్టోరీపైన సినిమా తీసిన లెజండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా" అని అంబటి రాయుడు స్పీచ్ మొదలుపెట్టాడు.

"మన అభిమాన నాయకుడు జగన్ గారి జీవితం ఆధారంగా వ్యూహం సినిమాను రూపొందించిన దర్శకుడు వర్మ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా ఎంతో ఇన్ స్పైరింగ్ గా ఉంటుందని ఆశిస్తున్నా. మనమంతా జగన్ గారికి 2024లో మరోసారి సీఎం చేసేందుకు కలిసి రావాలని కోరుతున్నా. వ్యూహంతో జగన్ గారి మీద చేసిన దుష్ప్రచారాల వెనుక దాగి ఉన్న నిజాలు తెలుస్తాయి" అని అంబటి రాయుడు తెలిపాడు.

తదుపరి వ్యాసం