తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl Asia Cup Final: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత తుదిజట్టులోకి సుందర్.. ఆ ఐదుగురు కూడా..

IND vs SL Asia Cup Final: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత తుదిజట్టులోకి సుందర్.. ఆ ఐదుగురు కూడా..

17 September 2023, 14:54 IST

    • Asia Cup Final 2023 Toss:ఆసియాకప్ 2023 ఫైనల్ సమరం మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‍కు దిగనుంది. టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది.
Asia Cup Final 2023 Toss: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత తుదిజట్టులోకి సుందర్.. ఆ ఐదుగురు కూడా..
Asia Cup Final 2023 Toss: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత తుదిజట్టులోకి సుందర్.. ఆ ఐదుగురు కూడా..

Asia Cup Final 2023 Toss: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత తుదిజట్టులోకి సుందర్.. ఆ ఐదుగురు కూడా..

Asia Cup Final 2023 Toss: టీమిండియా, శ్రీలంక మధ్య ఆసియాకప్ 2023 ఫైనల్ పోరు షురూ అయింది. టైటిల్ కోసం ఇరుజట్లు తలపడుతున్నాయి. లంకలోని కొలంబో ఆర్.ప్రేమదాస మైదానంలో నేడు (సెప్టెంబర్ 17) భారత్, శ్రీలంక మధ్య ఈ ఫైనల్ ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది. కాగా, గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో స్పిన్ ఆల్‍రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు భారత తుదిజట్టులో చోటు దక్కింది. ఇక, బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ కూడా శ్రీలంకతో ఈ ఫైనల్ పోరుకు భారత తుదిజట్టులోకి తిరిగి వచ్చేశారు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

స్పిన్ ఆల్‍రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో ఫైనల్‍కు ముందు రోజే టీమిండియాతో కలిశాడు వాషింగ్టన్ సుందర్. ఇప్పుడు ఫైనల్‍లో భారత తుదిజట్టులోకి వచ్చాడు. పిచ్ స్పిన్‍కు అనుకూలించేలా ఉండటంతో సుందర్‌కే మొగ్గుచూపింది మేనేజ్‍మెంట్. అలాగే గత మ్యాచ్‍లో విశ్రాంతి ఇచ్చిన ఆటగాళ్లు ఈ మ్యాచ్‍కు తుదిజట్టులోకి వచ్చారని టాస్ సమయంలో చెప్పాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఒకవేళ టాస్ గెలిచి ఉంటే తాను కూడా ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకునేవాడినని అన్నాడు. శ్రీలంక నిర్దేశించే టార్గెట్‍ను ఛేదిస్తామని తాను పూర్తి విశ్వాసంతో ఉన్నామని హిట్‍మ్యాన్ చెప్పాడు. కాగా, వర్షం పడటంతో మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆలస్యమైంది.

గాయపడిన స్పిన్నర్ తీక్షణ స్థానంలో తుదిజట్టులోకి దసున్ హేమంతను తీసుకున్నట్టు శ్రీలంక కెప్టెన్ దసున్ శనక చెప్పాడు. పిచ్‍పై టర్న్ ఉంటుందని అన్నాడు. 

భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‍ప్రీత్ బుమ్రా, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

శ్రీలంక తుదిజట్టు: పతుమ్ నిస్సంక, కుషాల్ పెరీరా, కుషాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వ, దసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దసన్ హేమంత, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ

తదుపరి వ్యాసం