తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup Final: టీమిండియా, శ్రీలంక మధ్య ఆసియాకప్ ఫైనల్ ఫైట్.. భారత తుది జట్టు ఎలా ఉండొచ్చు.. వాన పడుతుందా?

Asia Cup Final: టీమిండియా, శ్రీలంక మధ్య ఆసియాకప్ ఫైనల్ ఫైట్.. భారత తుది జట్టు ఎలా ఉండొచ్చు.. వాన పడుతుందా?

16 September 2023, 22:10 IST

    • Asia Cup Final: ఆసియాకప్ 2023 టోర్నీ ఫైనల్ పోరుకు భారత్, శ్రీలంక రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‍లో ఇండియా తుది జట్టు ఎలా ఉండే ఛాన్స్ ఉందో ఇక్కడ చూడండి. అలాగే, వాన పడే ఛాన్స్ ఎంత..
Asia Cup Final: టీమిండియా, శ్రీలంక మధ్య ఆసియాకప్ ఫైనల్ ఫైట్.. భారత తుది జట్టు ఎలా ఉండొచ్చు.. వాన పడుతుందా?
Asia Cup Final: టీమిండియా, శ్రీలంక మధ్య ఆసియాకప్ ఫైనల్ ఫైట్.. భారత తుది జట్టు ఎలా ఉండొచ్చు.. వాన పడుతుందా? (BCCI Twitter)

Asia Cup Final: టీమిండియా, శ్రీలంక మధ్య ఆసియాకప్ ఫైనల్ ఫైట్.. భారత తుది జట్టు ఎలా ఉండొచ్చు.. వాన పడుతుందా?

Asia Cup 2023 Final: ఆసియాకప్ 2023 టైటిల్ ఫైట్‍లో తలపడేందుకు టీమిండియా, శ్రీలంక సిద్ధమయ్యాయి. కొలంబో వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 17) ఇండియా, లంక మధ్య ఫైనల్ జరగనుంది. ఇండియా పదోసారి ఆసియాకప్ ఫైనల్‍లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఏడుసార్లు టైటిల్ పట్టిన భారత్.. ఎనిమిదో ఆసియా ట్రోఫీ కోసం పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‍లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం చెందిన భారత్.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్‍కు పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగనుంది. చివరగా 2018లో ఆసియాకప్ గెలిచిన భారత్.. మరోసారి ఐదేళ్ల తర్వాత ఆసియా చాంపియన్లుగా నిలువాలని తహతహలాడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

వర్షం పడుతుందా..?

భారత్, శ్రీలంక మధ్య ఆసియాకప్ 2023 ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్ 17వ తేదీ) మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో స్టేడియంలో మొదలుకానుంది. కొలంబోలో ఆదివారం స్వల్ప వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం, ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు, రాత్రి ఎనిమిది, పది గంటలకు వర్షం పడే ఛాన్స్ ఉంది. అయితే, కురిసినా అది స్వల్పంగానే ఉండొచ్చు. మ్యాచ్‍కు పెద్ద ముప్పు ఉండకపోవచ్చు. ఒకవేళ వర్షం వల్ల ఆదివారం ఆట నిలిచిపోయినా.. ఈ ఫైనల్ మ్యాచ్‍కు సోమవారం రిజర్వ్ డే ఉంది.

టీమిండియా తుదిజట్టు ఇలా..

బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍‍కు విశ్రాంతి తీసుకున్న భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఫైనల్ కోసం తుదిజట్టులోకి రానున్నారు. గాయపడిన అక్షర్ పటేల్ జట్టులో ఉండేది అనుమానంగా మారింది. మరోవైపు పూర్తిగా కోలుకోని శ్రేయస్ అయ్యర్ కూడా శ్రీలంకతో ఫైనల్ ఆడడం కష్టమే. ఒకవేళ కొలంబో పిచ్ స్పిన్‍కు ఎక్కువ అనుకూలంగా ఉంటే ఇషాన్ కిషన్‍ను పక్కన పెట్టి.. పార్ట్ టైమ్ స్పిన్ బౌలింగ్ వేయగలిగే తిలక్ వర్మను తుది జట్టులోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా టీమిండియా మేనేజ్‍మెంట్‍లో ఉంది. వాషింగ్టన్ సుందర్‌ను అక్షర్‌ పటేల్‍కు కవర్‌గా కొలంబోకు పిలిపించుకున్నా.. అతడికి తుది జట్టులో చోటు లభించడం అనుమానమే. ఒకవేళ సుందర్‌ను తీసుకోవాలంటే శార్దూల్‍ను పక్కన పెట్టాల్సి వస్తుంది.

ఆసియాకప్ ఫైనల్‍కు భారత తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్/ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ వాషింగ్టన్ సుందర్, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‍ప్రీత్ బుమ్రా

మరోవైపు స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయపడడం శ్రీలంకకు ఎదురుదెబ్బగా మారింది. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ దసున్ హేమంతను తీసుకుంది లంక.

తదుపరి వ్యాసం