తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Smat 2023: 11 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ చేసిన అషుతోశ్: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్

SMAT 2023: 11 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ చేసిన అషుతోశ్: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్

17 October 2023, 21:08 IST

    • SMAT 2023: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సంచలనం నమోదైంది. రైల్వేస్ బ్యాటర్ అషుతోశ్ శర్మ 11 బంతుల్లోనే అర్ధ శతకం చేసి.. అదరగొట్టాడు. వివరాలివే..
అషుతోశ్ శర్మ - యువరాజ్ సింగ్
అషుతోశ్ శర్మ - యువరాజ్ సింగ్

అషుతోశ్ శర్మ - యువరాజ్ సింగ్

SMAT 2023: భారత దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2023)లో సంచలనం నమోదైంది. రైల్వేస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అషుతోశ్ శర్మ భీకర హిట్టింగ్ చేశాడు. 12 బంతుల్లో ఒక ఫోర్, 8 సిక్సర్లతో ఏకంగా 52 పరుగులు చేశారు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్-సీలో భాగంగా మంగళవారం (అక్టోబర్ 17) అరుణాచల్ ప్రదేశ్‍తో జరిగిన మ్యాచ్‍లో రైల్వేస్ బ్యాటర్ అషుతోశ్ ఈ సంచలన బ్యాటింగ్ చేశాడు. దీంతో భారత దిగ్గజ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును అషుతోశ్ బద్దలుకొట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

యువీ రికార్డు బ్రేక్

టీ20 క్రికెట్‍లో అత్యంత వేగంగా అర్ధ శతకం చేసిన భారత బ్యాట్స్‌మన్‍గా యువరాజ్ సింగ్ రికార్డును అషుతోశ్ శర్మ బద్దలుకొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‍లో ఇంగ్లండ్‍పై 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు భారత స్టార్ యువరాజ్. ఇప్పుడు దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 11 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు అషుతోశ్. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత ప్లేయర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా, గత నెల జరిగిన ఏషియన్ క్రీడల్లో నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ అరీ 9 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేసి.. వరల్డ్ ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ రికార్డును నమోదు చేశాడు. యువరాజ్ సింగ్ పేరిట 16 సంవత్సరాల పాటు ఉన్న అంతర్జాతీయ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు అషుతోశ్ కూడా యువీ రికార్డును దాటేసి.. అత్యంత వేగంగా టీ20 హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డును దక్కించుకున్నాడు. అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలిచాడు.

రైల్వేస్ భారీ విజయం

అషుతోశ్ భీకర హిట్టింగ్‍తో అరుణాచల్ ప్రదేశ్‍తో నేడు జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసింది. ఉపేంద్ర యాదవ్ (51 బంతుల్లో 103 నాటౌట్) అజేయ శతకం చేశాడు.

భారీ లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ తీవ్రంగా తడబడింది. 18.1 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో రైల్వేస్ 127 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

తదుపరి వ్యాసం