తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Afg Vs Ned: సెమీస్‌పై క‌న్నేసిన అప్ఘ‌నిస్థాన్ - ప‌సికూన చ‌రిత్ర సృష్టించేనా?

Afg vs Ned: సెమీస్‌పై క‌న్నేసిన అప్ఘ‌నిస్థాన్ - ప‌సికూన చ‌రిత్ర సృష్టించేనా?

03 November 2023, 11:04 IST

  • Afg vs Ned: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ బెర్తుపై ప‌సికూన అప్ఘ‌నిస్థాన్ క‌న్నేసింది. శుక్ర‌వారం (నేడు)నెద‌ర్లాండ్స్‌పై విజ‌యం సాధిస్తే అప్ఘ‌నిస్తాన్ ఆరు పాయింట్స్‌తో సేమీస్ రేసులో నిలుస్తుంది.

అప్ఘ‌నిస్తాన్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్‌
అప్ఘ‌నిస్తాన్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్‌

అప్ఘ‌నిస్తాన్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్‌

Afg vs Ned: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌న విజ‌యాల్ని న‌మోదు చేసి చ‌రిత్ర‌ను సృష్టించింది అప్ఘ‌నిస్థాన్. ఎలాంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలో దిగిన అప్ఘ‌నిస్తాన్ ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక‌ల‌ను మ‌ట్టిక‌రిపించింది. వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ రేసులో పోటీపడటానికి సిద్ధమైంది. శుక్ర‌వారం నెదర్లాండ్స్‌తో ఆప్ఘ‌నిస్థాన్ త‌ల‌ప‌డ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే పాకిస్థాన్‌ను వెన‌క్కి నెట్టి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో స‌మానంగా టాఫ్ ఫైవ్‌లోకి అప్ఘ‌నిస్తాన్ అడుగుపెడుతుంది. ప్ర‌స్తుతం అప్ఘ‌నిస్తాన్ ఆరు మ్యాచుల్లో మూడు విజ‌యాల‌తో ఆరో స్థానంలో ఉంది. ఒక‌వేళ నెదర్లాండ్స్‌ఫై గెలిస్తే ఎనిమిది పాయింట్ల‌తో ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకొని ఐదో స్థానానికి చేరుకుంటుంది.

ఆరు పాయింట్స్‌తో ఉన్న పాకిస్థాన్ ఐదు నుంచి ఆరో స్థానానికి ప‌డిపోతుంది. ఇప్ప‌టికే ఇండియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న‌ది. మిగిలిన మూడు స్థానాల కోసం సౌతాఫ్రికాతో పాటు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా పోటీప‌డుతోన్నాయి.

నెదర్లాండ్స్‌పై అప్ఘ‌న్ విజ‌యం సాధిస్తే సెమీస్ రేసులోకి అఫీషియ‌ల్‌గా అప్ఘ‌న్ వ‌స్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మిగిలిన మ్యాచుల్లో ఓట‌మి పాలైతే అప్ఘ‌న్ సెమీస్ రేసులోకి అడుగు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ నేప‌థ్యంలో నేటి మ్యాచ్ రిజల్ట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మ్యాచ్ పైనే పాకిస్థాన్ భవితవ్యం కూడా ఆధారపడి ఉంది.

తదుపరి వ్యాసం