తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vodafone Idea: ఆ ఒక్క ప్రకటనతో ఒక్కసారిగా కుప్పకూలిన వొడాఫొన్ - ఐడియా షేర్లు

Vodafone Idea: ఆ ఒక్క ప్రకటనతో ఒక్కసారిగా కుప్పకూలిన వొడాఫొన్ - ఐడియా షేర్లు

HT Telugu Desk HT Telugu

02 January 2024, 14:58 IST

  • Vodafone Idea: గత ఆరు, ఏడు సెషన్లలో రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన వొడాఫొన్ - ఐడియా (Vodafone Idea VI) షేర్లు మంగళవారం ఒక్కసారిగా పడిపోయాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు వీఐ (VI) ఇచ్చిన ఒక వివరణ కారణంగా ఆ కంపెనీ షేర్లు ఒక్క రోజులోనే 5% పైగా పడిపోయాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vodafone Idea: వోడాఫోన్ ఐడియా (Vodafone Idea VI) టెలికమ్యూనికేషన్ సంస్థ త్వరలో ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్టార్‌లింక్‌’ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనుందని గత వారం రోజులుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దాంతో, వోడాఫోన్ ఐడియా (Vodafone Idea VI) కంపెనీ షేర్ల విలువ భారీగా పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఒక్క రోజులో మళ్లీ కిందకు..

కానీ, స్టార్ లింక్ తో ఒప్పందానికి సంబంధించి వోడాఫోన్ ఐడియా (Vodafone Idea VI) మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు ఒక లేఖ రాసింది. స్టార్ లింక్ (Starlink) తో ఒప్పందానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగడం లేదని ఆ లేఖలో వోడాఫోన్ ఐడియా (Vodafone Idea VI) స్పష్టం చేసింది. దాంతో, వెంటనే వోడాఫోన్ ఐడియా (Vodafone Idea VI) షేర్ల విలువ పడిపోవడం ప్రారంభమైంది. ఈ వివరణ బహిర్గతమైన కొద్ది సేపట్లోనే ఆ కంపెనీ షేర్ల ధరలు 5% పైగా తగ్గాయి.

స్టార్ లింక్ తో భాగస్వామ్యం..

వోడాఫోన్ ఐడియా (Vodafone Idea VI), ఎలాన్ మస్క్ కు చెందని స్టార్ లింక్ (Starlink) తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుందన్న వార్తలు గత రెండు వారాలుగా ప్రధాన బిజినెస్ మీడియాలో సైతం వచ్చాయి. స్టార్ లింక్ అనేది అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రొవైడర్ గా ఉంది. ఈ కథనాల నేపథ్యంలో వీఐ (VI) షేర్ల విలువ భారీగా పెరిగింది. గత రెండు సెషన్స్ లో వీఐ షేర్ల విలువ 30% పైగా పెరిగాయి. సోమవారం వీఐ షేరు ధర రూ. 17.75 గా ఉంది. కానీ, మంగళవారం స్టాక్ ఎక్స్చేంజ్, సెబీలకు వీఐ ఇచ్చిన వివరణ అనంతరం, మళ్లీ ఈ స్టాక్ ధర తగ్గడం ప్రారంభమైంది.

తదుపరి వ్యాసం