Most subscribed Youtube channel : ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానెల్.. మనదే!
12 February 2023, 11:11 IST
- Most subscribed YoutTube channel : ప్రపంచంలో చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. మరి సబ్స్క్రైబర్స్ పరంగా టాప్‌లో ఉన్న యూట్యూబ్ ఛానెల్ ఏదో తెలుసా? ఇండియాకు చెందిన టీ- సిరీస్.. ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది!
ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానెల్.. మనదే!
Biggest YouTube channel : ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ ఛానెల్ టీ- సిరీస్ దుమ్మురేపింది! ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానెల్ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది.
8 ఛానెల్స్.. టాప్‌లో టీ- సిరీస్..!
ప్రపంచంలో అత్యధిక మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూట్యూబ్ ఛానెల్ జాబితాను జర్మనీకి చెందిన 'స్టాటిస్టా' తాజాగా వెల్లడించింది. ఇదొక కన్జ్యూమర్ డేటా అండ్ మార్కెట్ ఇన్సైట్స్ కంపెనీ. ఈ ఏడాది జనవరి 25 నాటికి.. ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానెల్‌పై "ది యూట్యూబ్ ఛానెల్స్ విత్ ది మోస్ట్ సబ్స్క్రైబర్స్" అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.
Most subscribed YouTube channel : ఈ జాబితాలో మొత్తం 8 ఛానెల్స్ ఉన్నాయి. ఇవి మ్యూజిక్, కిడ్స్, కంటెంట్, వినోదం, స్పోర్ట్స్‌కి సంబంధించనవి కావడం విశేషం. వాస్తవానికి 2018 వరకు PewDiePie అనే యూట్యూబ్ ఛానెల్ టాప్ పొజిషన్లో ఉండేది. వరుసగా ఐదేళ్లు ఆ స్థానంలో కొనసాగింది. టీ సిరీస్.. దానికి గట్టిపోటీనిచ్చి.. తొలి స్థానాన్ని లాగేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ప్యూడైపై యూట్యూబ్ ఛానెల్ 5వ స్థానానికి పడిపోయింది. ఈ ప్యూడైపై అనేది ఒక వినోదాత్మక ఛానెల్. ఇది స్వీడిష్ యూట్యూబర్ ఫెలిక్స్ అరవిద్ ఉల్ఫ్‌కి చెందినది. అతనొక నటుడు, కమీడియన్, గేమర్- కామెంటర్. వీడియో కంటెంట్‌కి అతను ప్రసిద్ధి.
అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్స్..
T series YouTube channel subscribers : ఇక ఇండియాకు చెందిన టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్.. గుల్షణ్ కుమార్, భూషణ్ కుమార్‌లకు చెందినది. దీనికి 234మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు.
రెండో స్థానంలో కోకోమిలన్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. 152 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇదొక కిడ్ కంటెంట్ ఛానెల్.
How to add subtitles to YouTube video : యూట్యూబ్ వీడియోలకు సబ్‌టైటిల్స్ ఎలా యాడ్ చేయాలి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మూడో స్థానాన్ని ఎస్ఈటీ ఇండియా అనే యూట్యూబ్ ఛానెల్ దక్కించుకుంది. 150 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు.
నాలుగో స్థానంలో మిస్టర్ బీస్ట్ (129 మిలియన్), ఐదో స్థానంలో ప్యూడైపై (111 మిలియన్), ఆరో స్థానంలో కిడ్స్ డయానా షో (107 మిలియన్), 7వ స్థానంలో లైక్ నస్త్య (104 మిలియన్), 8వ స్థానంలో డబ్ల్యూడబ్ల్యూఈ (93 మిలియన్) యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి.
YouTube channel with most number of subscribers : నివేదిక ప్రకారం.. 2020 వరకు మ్యూజిక్, వినోదం వంటి యూట్యూబ్ ఛానెల్స్‌కే క్రేజ్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కిడ్ కంటెంట్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది.